*ఘనంగా విశ్వేశ్వర స్వామి (దస్పల్ల శివాలయం ) ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం*
*ఆలయ ప్రతిష్టని పెంచండి*
*దక్షిణ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్*
జగదాంబ జంక్షన్ దరి ఉన్న సూర్యా బాగ్ లో గల విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి గా విచ్చేసిన
దక్షిణ ఎమ్మేల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో
ఈవో దేముడు ఆలయ ట్రస్ట్ కమిటీ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అత్యధిక ముఖ్యమైన జంక్షన్లో ఉన్న ఈ ఆలయం చిన్నప్పుడు నుండి చూస్తున్నానన్నారు. విశ్వేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకంతో స్వామి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారన్నారు. అటువంటి ప్రతిష్ట ఆలయానికి ట్రస్ట్ సభ్యులుగా ఎన్నికైనందుకు అదృష్టవంతులన్నారు. నిరంతరం స్వామివారి సేవలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధి కి తోడ్పడాలన్నారు. ఈ ప్రాంతంలో మంచి వ్యాపారవేత్తలు ఉన్నారని, ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు వారిని వినియోగించుకునేలా ఆకట్టుకోవాలన్నారు. దేవుడు వ్యక్తి రూపంలోనే సాయం చేస్తారని, ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ తో మళ్ళీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయడానికి ఆ విశ్వేశ్వర స్వామి వారిని ప్రార్థించాలని ట్రస్ట్ సభ్యులను కోరారు.
ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బాదం పూడి సూర్య కాంతం మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి కల్పించిన అదృష్ట అవకాశాన్ని శివుని కృపతో ఆలయాన్ని చిత్తశుద్ధితో సమన్వయంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ట్రస్ట్ బోర్డ్
సభ్యులుగా రెడ్డి జగన్ మోహన్ రావు, మళ్ళ రమాదేవి & విజయ్ , కోడూరు మల్లిక ప్రియాంక, వడ్డాది జయ లక్ష్మి, ఎక్స్ అఫిషియో సభ్యుడు గా బాదం పూడి విశ్వేశ్వర రావు నియమితులయ్యారు.
ఈ కార్యక్రమంలో 30 వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పల రత్నం, మండల అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్, శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం, దేవస్థానం ఈవో దేముడు, ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, వైస్సార్సీపీ నాయకులు పెంటపల్లి సత్యనారాయణ, కనక రెడ్డి, దశమంతుల మాణిక్యాలరావు రావు, రీసు అనురాధ, రామలక్ష్మి, లింగం శ్రీను, లండా రమణ, ముజేబఖాన్, బుజ్జి, ఆదివిష్ణు, చిన్ని, దిలీప్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.