లోకేష్ నీది రెడ్ బుక్ అయితే… నాది యమ బుక్
ప్రైవేట్ సంస్థకు చౌకగా భూమిని ఎలా కేటాయిస్తారు
వరుణ్ హాస్పిటాలిటీ సంస్థ కోసం ప్రత్యేక జీవోలు
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం సరికాదు
— తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్
విశాఖపట్నం: లక్షలాది రూపాయలు విలువ చేస్తే భూమిని అతి తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం కేటాయించిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీవ్ర మైన అభ్యంతరం చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. ఇది అంశమై నగరంలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి.వి.రామ్ మాట్లాడుతూ.. విశాఖ బీచ్ రోడ్ మహారాణిపేట లోని టీ.ఎస్ నెంబర్ 1200 లో కేవలం 47 వేల రూపాయలు చొప్పున 1236 గజాల స్థలాన్ని వరుణ్ హాస్పిటాలిటీస్ సంస్థకు చౌకగా అప్పగించారన్నారు. జీ ఓ నెంబర్ 86 ప్రకారం 2019 ఫిబ్రవరి 5వ తేదీన అప్పటి టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారం కొనసాగిందన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లలోపు నిర్మాణం పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జీవో నెంబర్ 86 విడుదల చేసిన కొద్ది రోజులకే జీవో నెంబర్ 153 ను కొత్తగా తీసుకువచ్చారన్నారు. 153 జీవో ప్రకారం నిబంధనలను సడలించారన్నారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోవడం, వైసిపి అధికారంలోకి రావడంతో సదరు సంస్థ నిర్మాణాన్ని ప్రారంభించలేదన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ తన తల్లి తోపాటు హాజరయ్యారని రామ్ ప్రస్థావించారు. వ్యవహారంలో విశాఖలోని ఎమ్మెల్యేలకు కూడా హస్తముందన్నారు. వాస్తవానికి ఆ 1236 గజాల స్థలాన్ని బహిరంగంగా అమ్మకానికి పెడితే కనీసం రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వానికి ఆదాయం లభించేది అన్నారు. కార్మికుల కుటుంబాలకు కనీసం కోటి రూపాయలు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఎలా కట్టబడతారని ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ లోకేష్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
*మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు*
మధ్య తరగతి ప్రజలకు చెందిన అనేక భూములను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించు కోలేకపోవడం, పిల్లలకు పెళ్లిళ్లు చేయ లేకపోవడం నిలిచిపోయాయన్నారు. ఆర్థికంగా బలోపేతమై ఉన్న పెద్దలకు ఒక న్యాయం.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఒక న్యాయం సరికాదన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని రామ్ అభిప్రాయపడ్డారు.
*ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు*
రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కర్కసంగా వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ అనే యువకుడిని అన్యాయంగా లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. మానవ హక్కులకు తీవ్రమైన విఘాతం కలుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై తాను మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి వస్తోందన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోనని.. ప్రమాద బాధితుల కోసం, స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తెలుగు శక్తి నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు.
*_నీది రెడ్ బుక్ అయితే… నాది యమ బుక్_*
“లోకేష్ నీది రెడ్ బుక్ అయితే నాది యమ బుక్.. నీ బుక్ లో నువ్వు రాసుకోవాలేమో.. కానీ నా బుక్ లో ముందే రాసి పెట్టి ఉంటుంది” అని రామ్ వ్యాఖ్యానించారు.
ఐ.ఎన్.టి.యు.సి నాయకులు మంత్రి రాజశేఖర్, వరసాల శ్రీనివాసరావు, ఈ ప్లాంట్ గుర్తింపు యూనియన్ ఉపాధ్యక్షులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో కార్మికులు జరిగిన నష్టాన్ని చనిపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించలేదని ఎవరికి వచ్చినట్టు వారు తమ సొంత నిర్ణయాలు తెలియజేస్తూ కార్మికులు భవిష్యత్తును పట్టించుకోకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రులు వచ్చి వారిని సముదాయిస్తున్నారని స్టీల్ ప్లాంట్ నాయకులు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్లో గతంలో 18 వేల మంది కార్మికులు ఉండే వారిని ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 వేల వరకు తగ్గించేసారని, అధికారులు కార్మికులు వేధింపులకు గురిచేస్తూ అధిక ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు.
విలేకరుల సమావేశంలో డాక్టర్ పపూర్ నికుంజ్, టీ. సాంబ శివరావు, రాష్ట్ర మత్స్యశాఖ నాయకులు వాసుపల్లి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.