పర్యావరణ హితంగా జీవించుదాం అని ఎస్ ఒ ఎస్ విద్యార్థులకు గ్రీన్ క్లైమేట్ టీం ! #vvwnews

by vvwnews.com

పర్యావరణ హితంగా జీవించుదాం అని ఎస్ ఒ ఎస్ విద్యార్థులకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు . శనివారం ఉదయం పెందుర్తి మండలం పెద్ద గాడి దగ్గర ఉన్న సంకల్ప కళా గ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు నేతృత్వంలో భీమిలి ఎస్ ఒ ఎస్ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ముందుగా డ్రోన్ లతో విత్తనాల గోళీలు జల్లించేందుకు విద్యార్థులు తో ఆరు మిల్లీ మీటర్ల సైజ్ లో విత్తనాల గోళీలు, బంతులు తయారు చేయించారు. అనంతరం రత్నం మాట్లాడుతూ విత్తన గోళీలు, బంతులు తయారు చేసి, కొండల మీద, తీరంలో చల్లాలని, తద్వారా శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలని కోరారు. డ్రోన్ లతో చల్లెఝదుకు ఆరు మిల్లీ మీటర్ల పరిమాణం లో విత్తనాల గోళీలు తయారు చేయడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. సంకల్ప కళా గ్రామం ఒక పర్యాటక ప్రదేశం అని వివరించారు. ఈ గ్రామం మరింత విస్తృతంగా అభివృద్ధి చెందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆకుల చలపతిరావు మాట్లాడుతూ ఎద్దు గానుగ తో తయారు చేసిన నూనెలు ఆరోగ్యకరమైనవనిగా వివరించారు. అంతే కాకుండా తమ వద్ద కొయ్య బొమ్మలు, ప్రకృతి ఆధారంగా వేసిన రంగులతో నేసిన బట్టలు తయారు అవుతాయి అని వివరించారు.అలాగే ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు లభ్యమవుతాయి అని అన్నారు.
సంస్థ ప్రతినిధి జమీలియా మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ప్రకృతి తో మమేకమై జీవించాలని కోరారు. మనం ఆరగించిన పండ్ల విత్తనాలు దాచి విత్తనాల బంతులు, గోళీలు తయారు చేయడం అవసరం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, ఎస్ చెస్ భీమిలి ప్రతినిధులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles