సాంకేతిక, డిజిటల్ మౌలిక వసతులను ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా #vvwnews

by vvwnews.com

జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ…

ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గారు పేర్కొన్నారు. కేవలం నిధులు ఖర్చు చేయడం మాత్రమే కాకుండా, ఆ ఖర్చుతో ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగిందో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచేందుకు రెవెన్యూ వచ్చే శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచితే, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు.

సాంకేతిక, డిజిటల్ మౌలిక వసతులను ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి గారు కోరారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మన ప్రభుత్వం వ్యర్థ ఖర్చులు లేకుండా సమర్థవంతమైన వ్యవస్థతో సంక్షేమ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన ప్రాధాన్యతల ప్రకారం శాఖలు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాగునీరు, రహదారులు, ఆసుపత్రులు సహా ఇతర రంగాల్లోనూ అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలకు సమర్థవంతమైన ఫలితాలు అందించాలన్నారు.

#CollectorsConference #ChandrababuNaidu #PayyavulaKeshav #Uravakonda #Anantapur #IdhiManchiPrabhutvam #AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles