ప్రచురణార్థం : నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భముగా డాక్టర్ J. చంద్రశేఖర్,సమగ్ర శిక్షా,అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఎం.వి.పి కోలనీ జె.కె.హైస్కూల్ సెక్టార్ -7 పాఠశాల ఆవరణంలో జ్యోతి ప్రజ్వలన చేసి, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సి. వి. రామన్ గారి పటము నకు పూలమాలను వేసి తదుపరి సైన్స్ ప్రదర్శన ప్రారంభించారు.డాక్టర్ చంద్రశేఖర్ ప్రదర్శనలో ప్రతీ నమూనాలను పరిశీలించి విద్యార్థులను వివరముగా అడిగి తెలుసుకుని తగు సూచన లిచ్చారు.విద్యార్థుల యొక్క నమూనాలు ఆలోచనను కలుగ చేసే విధముగా తయారు చేసారని సంతృప్తి చెందారు. తదుపరి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి కూడా విషయాన్ని తెలుసుకొని ఆకళింపు చేసుకోవాలన్నారు. విషయం ను పూర్తిగా తెలుసుకోవాలనే తపన, పట్టుదల, కృషి తో సాధించాలని అన్నారు. మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ A P J అబ్దుల్ కలామ్ కూడా అదే పట్టుదలతో సైంటిస్ట్ నుండి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి అయ్యారని తెలిపారు .
విద్యార్థులు సుమారు 40 నమూ నాలను ప్రదర్శించినారు. పాఠశాల విద్యార్థులు గుడ్ హాబిట్స్, సేవ్ వాటర్,
ఋతువులు, మొక్కలు – వాటి భాగములు గురించి చాలా బాగా వివరించారు. సోలార్ సిస్టమ్ సెట్ ఆఫ్ టీత్, బ్రెయిన్ మరియు పదార్థ స్థితులు,వాటర్ సైకిల్ -వాటర్ హార్వెస్టింగ్,కన్వీక్సలెన్స్ ప్రాజెక్టర్, సెన్స్ ఆర్గాన్స్, వేలాడే కీలు , హైడ్రో ఎలక్ట్రిసిటీ వర్కింగ్ మోడల్, బయో డైవర్సిటీ,జైగోట్ తయారీ గురించి విపులముగా
తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.వి.జయకుమార్ మాట్లాడుతూ ఫిజిక్స్ రంగములో రామన్ ఎఫెక్ట్ ను 1928,ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని తెలియచేస్తూ ,సైన్స్ పట్ల అవగాహన , శాస్త్రీయ విజ్ఞానం , సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయిని మరియు ఆలోచనను కలుగజేసే విధానం దై నందిన జీవితములో ఎట్లా వినియోగించు కోవాలో ఈ ప్రదర్శన వల్ల తెలుసు కోవచ్చునని తెలియ జేశారు .ఈ సందర్భముగా పాఠశాల డైరెక్టర్ ఆర్.వి. రవికుమార్,పాఠశాల ఉపాధ్యాయులు కె.అనిల్ కుమార్ , ఎన్.కృష్ణకుమారి, టి.సాయికుమార్ , సెల్వి , ఎస్. పద్మ , దనజ్యోతి మరియు విద్యార్థులు తల్లితండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భముగా డాక్టర్ J. చంద్రశేఖర్,సమగ్ర శిక్షా,
4