:
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC)
మీడియా రిలీజ్
ఐసిసి (ICC) డిఫెన్స్ స్టార్టప్ & అటానమస్ సిస్టమ్స్ సమ్మిట్
విశాఖపట్నం 23 ఫిబ్రవరి, 2026
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఆధ్వర్యం లో ‘డిఫెన్స్ స్టార్టప్ & అటానమస్ సిస్టమ్స్ సమ్మిట్’ విశాఖపట్నం లో జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి తూర్పు నౌకాదళ ప్రధానాధికారి (FOC-IN-C East) వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా (AVSM, NM) ప్రసంగించారు. ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి సము ద్ర ప్రయో జనాలను పరిరక్షించడం మరియు ఇండో-పసిఫిక్ ప్రాం తం లో మన శక్తిని ప్రదర్శిం చడం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. అలాగే, దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ ద్వారా సాధించే ఆధునికీకరణ… దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని సాధించడంలో సహాయపడుతుం దని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మరియు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు అయిన డాక్టర్ జి. సతీష్ రెడ్డి ప్రసంగించారు. దేశ రక్షణ రంగ ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంపొం దించడం లో ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వా నికున్న సామర్థ్యాన్ని మరియు నైపుణ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు.
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE) సీఎండి మరియు రక్షణ, ఏరోస్పేస్ & స్పేస్ కు సంబంధించిన ఐసిసి నేషనల్ ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ కమోడోర్ పి.ఆర్, హరి (రిటైర్డ్) మాట్లాడుతూ… రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాన్ని ఆధునికీకరించడానికి ఎం ఎస్ ఎం ఈలు (MSMEs) మరియు స్టార్టప్ వినూత్న సామర్ధ్యాలను వినియో గించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ సింగ్ తన స్వాగతోపన్యాసంలో… ‘ఆత్మనిర్బర్ భారత్’ ద్వారా రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.
రక్షణ, ఏరోస్పేస్ & స్పేస్ కు సంబంధించిన ఐసిసి నేషనల్ కమిటీ కో-చైర్మన్ మరియు ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ ఎల్ పి బిజినెస్ కన్సల్టింగ్ భాగస్వామి కమాండర్ గౌతమ్ నందా అధికారికంగా వందన సమర్పణ చేశారు.
ఈ శిఖరాగ్ర సదస్సులో ‘డిఫెన్స్ ప్రొడక్షన్ పవరింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్” అనే పేరుతో నాలెడ్జ్ రిపోర్ట్ ను విడుదల చేశారు. ఎం ఎస్ ఎం ఈలు మరియు స్టార్టప్ ల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా బి2బి (B2B) సపోర్ట్ డెస్క్ ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.
23 ఫిబ్రవరి, 2026 ప్రచురణ నిమిత్తం జతపరచబడినది.
డాక్టర్ రాజీవ్ సింగ్
డైరెక్టర్ జనరల్
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
Rotate screen
Fit
Export
Share
Search