15న టిఎస్ఆర్ ఆధ్వర్యంలో ” 41వ మహా కుంభాభిషేకం “* #vvwnews

by vvwnews.com

*15న టిఎస్ఆర్ ఆధ్వర్యంలో ” 41వ మహా కుంభాభిషేకం “*

*సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు*

*పవిత్ర జలాలు, పళ్ళ రసాలతో శివలింగానికి భక్తులతో అభిషేకం*

— *ఉత్సవ కన్వీనర్, తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్*

విశాఖపట్నం: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ సాగర తీరాన మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న ఆదివారం 41వ మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్, తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి రామ్ తెలిపారు . శుక్రవారం ఉదయం టిఎస్ఆర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ ప్రాంతానికి ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి ఆపద కలగకూడదనే సంకల్పంతో 40 ఏళ్ళ కిందట డా. టి.సుబ్బరామిరెడ్డి ఆర్కే బీచ్ వద్ద మహా కుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని. అదే ఆనవాయితీతో ఈ ఏడాది కూడా ఆర్కే బీచ్ వద్ద మహా కుంభాభిషేకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జనసేన నాయకులు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్న డా. టి సుబ్బరామిరెడ్డి అభినందనీయులన్నారు. కాకినాడ భారత యజ్ఞపీఠం ప్రతినిధి, ఉత్సవ నిర్వాహకులు రత్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ టి .సుబ్బరామిరెడ్డి సొంత నిధులతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకానికి తన తాతగారైన శివ భక్తులు శ్రీకారం చుట్టారని, ఆ తర్వాత తన తండ్రి చిన్నబాబు ఉత్సవాలు నిర్వహించినట్టు చెప్పారు. భక్తులచే స్వయంగా పవిత్ర జలాలు, పళ్ళ రసాలతో శివలింగానికి అభిషేకాన్ని స్వయంగా టిఎస్సార్ చేయించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన ఏర్పాట్లను వివరించారు.టి ఎస్ ఆర్ కార్యదర్శి ఎస్ కే భాష మాట్లాడుతూ భక్తులకు రుద్రాక్షలు, పసుపు తాళ్లు, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు జరిగే మహా కుంభాభిషేకంలో ,మధ్యాహ్నం జరిగే
హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు ఆధ్యాత్మిక సభ నిర్వహించనున్నారు. ఈ మహాశివరాత్రి వేడుకల సందర్భంగా మహా కుంభాభిషేక కార్యక్రమానికి శివ భక్తులు, విశాఖ నగర ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పేడాడ రమణి కుమారి, జి.వి.రామచంద్రరావు, మువ్వలు సురేష్, ఈ.కృష్ణ చైతన్య, ఫిలిం డైరెక్టర్ వి.వంశి బాబు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles