విదేశీ విద్యకు వేదిక.. విశాఖ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026’కు విశేష స్పందన ! #vvwnews

by vvwnews.com

విదేశీ విద్యకు వేదిక విశాఖ

‘గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026’కు విశేష స్పందన

ఫిబ్రవరి 7 విశాఖపట్నం.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ విశాఖ నగరంలో నిర్వహించిన “వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 & షార్ట్ ఫిలిం కాంపిటేషన్” దిగ్విజయంగా నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 30 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి పైడా కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మార్గదర్శిగా నిలుస్తాయని ప్రశంసించారు. భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అనంతరం బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ పి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ తన 18 ఏళ్ల వృత్తి జీవితంలో విశాఖ విద్యార్థుల నుండి వచ్చినంతటి అద్భుతమైన స్పందన ఎక్కడా చూడలేదని హర్షం వ్యక్తం చేశారు. “మన దేశంలోని ముంబై వంటి నగరాల్లో చదువుకోవడం కంటే యూరోప్ దేశాల్లో విద్య అత్యంత చవకగా లభిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల నుండి ట్రైనర్లను రప్పించాము. అలాగే, కపిల్ గ్రూప్‌కు చెందిన టాస్క్ అకాడమీ ద్వారా నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాము” అని ఆయన వివరించారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్, న్యూజిలాండ్, సౌత్ కొరియా వంటి దేశాల్లోని 25కు పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో తమకు ఒప్పందాలు ఉందని తెలిపారు. విద్యార్థులకు వారి ప్రతిభ ఆధారంగా 85% వరకు స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తున్నామని. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు 100% లోన్ అసిస్టెన్స్ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
విదేశీ ప్రయాణానికి ముందే విద్యార్థులను సిద్ధం చేసేందుకు ‘జంప్ స్టార్ట్ క్యాంపస్’ ప్రోగ్రామ్ అందుబాటులో ఉందని, మరిన్ని వివరాలకు తమ వెబ్సైటును సంప్రదించాలని కోరారు. శనివారం జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ లో 800 -1000 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
అలయన్స్ ఇన్‌స్టిట్యూట్ డీన్ కొల్లా సతీష్ కుమార్, మనోజ్ కుమార్, శ్రవణ్, టీం బ్లూ రిబ్బన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిజిటల్ మీడియా పార్ట్నర్ గా ఐ డ్రీం ఛానల్ వ్యవహరించారు

Use Social Media to Spread the Word about Our News

related articles