సీ ఫుడ్ ఎగుమతిదారుల సంఘం ఆఫ్ ఇండియా (SEAI) భారతదేశ సముద్ర ఆహార ఎగుమతి

by vvwnews.com

ప్రెస్ నోట్

సీ ఫుడ్ ఎగుమతిదారుల సంఘం ఆఫ్ ఇండియా (SEAI) భారతదేశ సముద్ర ఆహార ఎగుమతి రంగానికి సకాలంలో ఉపశమనం కలిగించి, కొత్త విశ్వాసాన్ని నింపిన రెండు ముఖ్యమైన వాణిజ్య పరిణామాల సందర్భంగా గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నేతృత్వంలోని భారత ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలను నమోదు చేస్తోంది. అవి-యూరోపియన్ యూనియన్ (EU) తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)ను విజయవంతంగా ముగించడము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA)తో ఇటీవల కుదిరిన వాణిజ్య అవగాహన, దీని ఫలితంగా భారతీయ సముద్ర ఆహారంపై విధించిన దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గించబడటం.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారతీయ సముద్ర ఆహారానికి అతి పెద్ద మార్కెట్గా కొనసాగుతోంది. 2024-25 సంవత్సరంలో అక్కడికి ఎగుమతుల విలువ USD 2.78 బిలియన్లు అయితే, ఆగస్టు 2025 నుంచి 50% వరకు శిక్షాత్మక సుంకాలు విధించడంతో ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమై. 2025 ఏప్రిల్-నవంబర్ కాలంలో విలువ పరంగా సుమారు 6.3% మరియు పరిమాణ పరంగా దాదాపు 15% తగ్గుదల నమోదైంది. ఇప్పుడు USAతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ద్వారా సుంకాలు 18%కు తగ్గించబడటం వల్ల భారతీయ సముద్ర ఆహార ఎగుమతులకు పోటీ సామర్థ్యం మరియు మార్కెట్ ప్రోప్యత తిరిగి లభించినందుకు SEAI స్వాగతం తెలుపుతోంది.

అదే సమయంలో, యూరోపియన్ యూనియన్ కుద్దిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ రంగానికి ఒక ప్రధాన సానుకూల పరిణామంగా నిలిచింది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, ఈ FTA ద్వారా EUకి భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న 4.2%-7.5% దిగుమతి సుంకాలు పూర్తిగా శూన్యానికి (NII) తగ్గనున్నాయి. దీని వలన భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ పోటీదారులతో సమాన ఖవకాశాలు లభిస్తాయి.

2024-25లో, భారతదేశం యూరోపియన్ యూనియన కు సుమారు USD 1.1 బిలియన్ల విలువైన సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసింది. EU ద్వారా 102 కొత్త భారతీయ మత్స్య యూనిట్లకు అనుమతి లిఫ్టింగ్) లభించడం వల్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 ఏప్రిల్-నవంబర్ కాలంలో, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే EUS సముద్ర ఆహార ఎగుమతులు పరిమాణ పరంగా 28% మరియు విలువ పరంగా 37.8% పెరిగాయి.

అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన సముద్ర ఆహార ఎగుమతిదారులు ఎదుర్కొన్న తీవ్రమైన సవాళ్లను కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా ప్రస్తావించినందుకు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవనీయ సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి SEAI తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. సముద్ర ఆహార ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, వారి నాయకత్వం మరియు మద్దతు ఎగుమతిదారులు, ప్రోసెసర్లు మరియు రైతులకు కీలకమైన విశ్వాసాన్ని అందించింది.

వాణిజ్య మరియు పరిశ్రమల గౌరవనీయ మంత్ర శ్రీ పీయూష్ గోయల్ జీతో పాటు వాణిజ్య మంత్రిత్వ శాఖ, మెరైన్ ప్రోడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ (MPEDA), ఎగుమతి తనిఖీ మండలి (EIC) అధికారుల నిరంతర కృషికి SEAI తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది. అలాగే, ఈ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న సమయంలో గౌరవనీయ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జీ మరియు ఆర్థిక సేవల విభాగం అధికారుల మద్దతును కూడా మేము కృతజ్ఞతలతో గుర్తిస్తున్నాము.

ఈ అన్ని పరిణామాలు కలిసి, విశ్వసనీయమైన మరియు పోటీ సామర్థ్యం గల గ్లోబల్ సముద్ర ఆహార సరఫరాదారుగా భారతదేశ స్థితిని మరింత బలపరుస్తూ, అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరమైన వృద్ధికి దృఢమైన పునాదిని వేస్తున్నాయి.

సహి/-

జి. పవన్ కుమార్

అధ్యక్షుడు

సీ ఫుడ్ ఎగుమతిదారుల సంఘం ఆఫ్ ఇండియా (SEAI)

4 ఫిబ్రవరి 2026

Use Social Media to Spread the Word about Our News

related articles