ప్రెస్ నోట్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి జి వామనమూర్తి డిమాండ్ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి బడా కార్పొరేట్ సంస్థలకు కార్మిక హక్కులను తాకట్టుపెట్టే చర్యలు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 3-2- 26 ఉదయం10 గంటలక రుషికొండ బీచ్ లో చిల్లర వర్తకల్లు ఫోటోగ్రాఫర్లు ఆటో డ్రైవర్లు తో నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగుల హక్కులను హరిస్తూ ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకు కార్మిక చట్టాలను తాకట్టు పెడుతుందని మండిపడ్డారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సమ్మె హక్కును ఎనిమిది గంటల పని దినాలను రద్దుచేసి కార్మికులతో శ్రమ దోపిడీ చేయడానికి ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు కార్మిక హక్కుల సాధనకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెలో ఆటో డ్రైవర్లు చిల్లరవర్తికలు ఫోటోగ్రాఫర్లు ముఠా కళా సిలు భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు దేశ సంపదకు మూల స్తంభాలైన అసంఘటిత కార్మికులకు పిఏపీఎస్ఐ పెన్షన్తో కూడిన సమగ్ర సంక్షేమ బోర్డు చేయాలని చిల్లర వర్తకులు ఫోటోగ్రాఫర్లు ఆటో డ్రైవర్లకు వ్యక్తిగత సామాజిక భద్రత కల్పిస్తూ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయాలని రుషికొండ షాపులకు ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని రుస్కొండ బీచ్ లో ఉన్న వందలాది మందికి తాగునీటి సౌకర్యం కల్పించాలని షెడ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యుత్తు మీటర్ రీడర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరుగు సార్వత్రిక సమ్మెలో కార్మికులు ఉద్యోగులు ప్రజలు పాల్గొని ప్రభుత్వం దివాలా ఆర్థిక విధానాలను ప్రతిఘటించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఈ ధర్నాలో కామ్రేడ్ రవికృష్ణ బి కోదండరాం చందర్రావు జి శ్రీను పి అమర్ జి రామారావు ఎస్ లక్ష్మణ్ వి గణేష్ అప్పలనాయుడు జి మోహన్ టి చిన్న అప్పన్న కెశివకుమార్ శ్రీమతి జి మంగ జి సత్యవతి జి సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి.రామారావు స్థానిక సంఘం నాయకులు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి జి వామనమూర్తి డిమాండ్ !!!
7