నావెల్ డాక్ యార్డ్ ఛార్జ్ మెన్ ఉద్యోగి, టిఎన్టియుసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వీ రమణ ఉద్యోగ విరమణ

by vvwnews.com

నావెల్ డాక్ యార్డ్ ఛార్జ్ మెన్ ఉద్యోగి, టిఎన్టియుసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వీ రమణ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని మురళినగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు రాజకీయ నాయకులు, టిఎన్టియుసి నాయకులు, డాక్ యార్డ్ ఉద్యోగులు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని దంపతులకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్వి రమణ మాట్లాడుతూ.. గత 39 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించానని, తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగి మాట్లాడుతూ.. టిఎన్టియుసి బలోపేతానికి ఎస్వీ రమణ నిరంతరం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్వీ రమణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి నాయకులు, నావెల్ డాక్ యార్డ్ విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగులు, ఇతర ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles