ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల సాధనకు జరుగు సార్వత్రికసమ్మె జయప్రదం చేయండి కమిటీ

by vvwnews.com

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల సాధనకు జరుగు సార్వత్రికసమ్మె జయప్రదం చేయండి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జీవామనమూర్తి కార్మిక వర్గానికి పిలుపు ఇచ్చారు కార్మిక పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పనిగంటలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే చర్యలను వ్యతిరేకిస్తూ తేదీ01-02- 2026 ఉదయం 11 గంటలకి అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైతు బజార్ రోడ్ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులు ఉద్యోగుల హక్కులనుహరిస్తుందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 10 నుంచి 12 గంటలకు పెంచి కార్మికుల ఉద్యోగులపై పని భారం పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోడ్లనురద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పనిగంటలను రద్దుచేసి ఎనిమిది గంటల పని విధానాన్నిఅమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా అక్కయ్యపాలెం నరసింహనాయుడు రైతు బజార్ వద్ద చిల్లర వర్తకులకు హాకర్ జోనులు కట్టించి ఇవ్వాలి అని హామీలేని జాతీయ బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం చిల్లర వర్తకలకు ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో డ్రైవర్లు ముఠా కళా సిలకు చిల్లర వర్తకలకు పీఎఫ్ ఈ ఎస్ ఐ పెన్షన్ తో కూడిన సమగ్ర సంక్షేమ బోర్డుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మికులు తమ హక్కుల సాధనకు ఫిబ్రవరి 12న జరుగు సార్వత్రిక సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు ఈ ధర్నాలో ఎఐటియుసి నాయకులు రావికృష్ణ కేలం శివ కే నీలకంఠం పి సాయికుమార్ సూర్యారావు చందర్రావు టి అనిల్ గణేష్ వి కృష్ణవేణి రవణమ్మ డి మాధవ దుర్గారావు మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్థానిక సంఘం అధ్యక్షులు జి నీలకంఠ

Use Social Media to Spread the Word about Our News

related articles