4
విశాఖ స్టీల్ కార్మికులకు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ తప్పు పట్టి స్టీల్ యాజమాన్యానికి పూHర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని వారు ఇచ్చిన ఆదేశాలను స్టీల్ యాజమాన్యం తక్షణమే అమలు చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని, ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించే సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు.