కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం #vvwnews #glassbridge #kailasagiri

by vvwnews.com

కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం

విశాఖలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం అయినటువంటి కైలాసగిరి పై సుమారు రూ.7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గాజు వంతెనను విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీ భరత్ , VMRDA ఛైర్పర్సన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ , తూర్పు శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు , జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస రావు , మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని అటు ఐటీ పరంగా ఇటు పర్యాటక పరంగా అభివృద్ధి చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వాటి ప్రభావంతో విశాఖకు అనేక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కైలాసగిరిపై ఇప్పటికే స్కై సైక్లింగ్, పారా గ్లైడింగ్ నెలకొల్పడం జరిగిందని, ఇప్పుడు సుమారు రూ. 7 కోట్ల ఖర్చుతో ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో గాజు వంతెన నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో అత్యంత సురక్షితమైన 40 MM మందంగల గాజుతో, దేశంలోనే 55 మీటర్ల పొడవైన నిర్మితమైన మొట్టమొదటి గాజు వంతెన అని తెలిపారు. అదేవిధంగా గంటకు 250 కి. మీ వేగంతో వీచే గాలులను కూడా తట్టుకొని నిలబడే విధముగా మరియు ఒకేసారి సుమారు 100 మందిని తట్టుకొనే విధముగా రూపకల్పన చేశారని తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles