ప్రచురణార్థం. *రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి* *వ్యర్థ రసాయనిక జలాలను తోడించాలి* * *సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్* పరవాడ. మండల కేంద్రమైన పరవాడ బర్నికం గ్రామాల మధ్య మొల్లోడు గడ్డలు అక్రమంగా బరితెగించిన రాంకీ యాజమాన్యం వ్యర్థ రసాన్నిక జలాలను విడుదల చేయడం వలన భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని వ్యవసాయం పడడం లేదని వెంటనే రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి. సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మొల్లోడు గడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు సైతం ముక్కు మూసుకొని ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు చేసినప్పుడు పిసిబి అధికారులు తూతు మంత్రంగా రాంకీ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య ఈ ప్రాంతాన్ని పరిశీలించారని తీసుకున్న చర్యలు ఏమిటో అర్థం కాలేదని అన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు రాంకీ యాజమాన్యానికి అడుగులకు మడుగులు ఉన్నారని ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే కూటమి నేతలు రాంకీ యాజమాన్యానికి అండగా నిలవడం వల్లనే ఈ రకంగా వాయు, జల కాలుష్యానికి రాంకీ యాజమాన్యం కారణమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడుతామని గని శెట్టి హెచ్చరించారు
రాంకీ వ్యర్థ రసాయనిక జలాలను తోడించాలి సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్* పరవాడ.
18