విజయాలకు ప్రతీకగా విజయ దమి పర్వదినం నిలుస్తుందని ప్రజాపిత
బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బికే రామేశ్వరీ అన్నారు.. బుధవారం డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు..గౌరవ అతిథిగా పాల్గొన్న
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దుర్గాదేవిని పూజిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలంతా భావిస్తారన్నారు.. ఆదిపరాశక్తిగా ..జగన్మాతగా ..శక్తి స్వరూపిణిగా కొలిచే ఆ దుర్గామాత విజయ దశమి పర్వదినాన ప్రజలందరికీ గొప్ప విజయాలు అందించాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. అలాగే సమాజాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు తో పాటు దేశ ప్రజలందరి పైన ఆ దుర్గాదేవి చల్లని ఆశీస్సులు ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. అన్ని పండుగలు జర్నలిస్టులతో కలిసి బ్రహ్మకుమారీలు గొప్పగా నిర్వహించడం అభినందనీయమన్నారు..
విజయాలకు ప్రతీకగా విజయ దమి పర్వదినం నిలుస్తుందని ప్రజాపితబ్రహ్మకుమారీస్ #vvwnews
19