*జ్ఞానాపురం*
ప్రజలందరికీ ఆ దుర్గ మాత ఆశీస్సులు ఉండాలని జ్ఞానాపురం హోల్ సేల్ మార్కెట్ వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్రాజు, పరమేశ్వరరావులు ఆకాంక్షించారు. శ్రీ దుర్గ మాంబ గూడ్స్ ఆటో స్టాండ్ అధ్యక్షులు శివారెడ్డి ఆధ్వర్యంలో జ్ఞానాపురం హోల్ సేల్ మార్కెట్ సమీపంలో శ్రీ దుర్గా పూజా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వీర్రాజు, పరమేశ్వరరావు, శివారెడ్డిలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో జ్ఞానాపురం హోల్ సేల్ మార్కెట్ లోని వ్యాపారులు, కూలీలు, డ్రైవర్లు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండాలని వీర్రాజు, పరమేశ్వరరావు, శివారెడ్డిలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గ మాంబ గూడ్స్ ఆటో స్టాండ్ ప్రతినిధులు, వ్యాపారులు, కూలీలు పాల్గొన్నారు.