*ఏ యు విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు : ప్రియాంక దండి*
విశాఖకు గర్వకారణం ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎంతోమంది గొప్ప వాళ్లు ఇక్కడ చదువుకొని దేశ ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు,ప్రజా ప్రతినిధులు, న్యాయ మూర్తులు, అధికారులుగా ఎదిగారని అలాంటి విశ్వావిద్యాలయాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆరోపించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు రాజకీయ కోణం ఉందని అనడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యార్థి విభాగం టి ఎన్ ఎస్ ఎఫ్ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేసింది అప్పుడు సమర్దించారు, ఇప్పుడు సామాన్య విద్యార్థులు వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయకండి, ఆంధ్ర యూనివర్సిటీలో సదుపాయాలు పెంచండి, ఆక్సిజన్ సిలెండరు ఇవ్వండి, అంబులెన్సు ఇవ్వండి, చనిపోయిన మణికంఠ కు న్యాయం చేయమని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని,మణికంఠ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రియాంక డిమాండ్ చేసారు.