విజయదశమి నాడు ఒక జమ్మి చెట్టు నాటండి- జెవి రత్నం, కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ

by vvwnews.com

విజయదశమి నాడు ఒక జమ్మి చెట్టు నాటండి
– జెవి రత్నం, కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
విజయదశమి నాడు పూజ చేసె జమ్మి చెట్టు (శమీవృక్షం) ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మద్దిలపాలెం లో విలేకరులతో ఆయన మాట్లాడారు. జమ్మి చెట్టు ఆకులు, బెరడు చర్మ సమస్యలను తగ్గించడంలో, కుష్టు రోగాన్ని నివారించడంలో సహాయపడతాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు అని వివరించారు. ఆకులను కళ్ళకు పూయడం వల్ల చికాకు నుంచి ఉపశమనం కలుగుతుంది అని అన్నారు.
ఆకులు, బెరడు పేస్ట్ తేలు కుట్టినప్పుడు ఔషధంగా పనిచేస్తుందని, శమీ చెట్టు బెరడును ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు. 
అవాంఛిత రోమాల నివారణకు కూడా జమ్మి ఆకులను ఉపయోగిస్తారు. 
అగ్నిని పుట్టించడానికి ఉపయోగపడే చెట్టు ఇది
జమ్మి ఆకులు, పువ్వులను కూరలు, ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు. జమ్మి విత్తనాలను వేయించి తింటారు.
అడవుల పెంపకంలో నేలకోతను నివారించడానికి ఈ చెట్లను ఉపయోగిస్తారు. ఎడారి లో సైతం పెరిగే చెట్టు ఇది.
విజయదశమి (దసరా )నాడు జమ్మి చెట్టుకు పూజ చేయడం సంప్రదాయం. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టులో దాచినట్లు పురాణాలు చెబుతాయి. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో జమ్మి చెట్టును నాటడం మంచిదని భక్తులు నమ్ముతారు.
పంటలకు హాని కలిగించే క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకునే పాలపిట్టలు జమ్మి చెట్టు మీద గూడు పెట్టుకుని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసి వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పెంచండి అని ఆయన కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles