తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి గ్రీన్ క్లైమేట్ టీం

by vvwnews.com

తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి
– డాక్టర్ వైఎస్ ఎస్ చంద్రశేఖర్, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, కొమ్మాది
తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి అని విశాఖపట్నంలోని కొమ్మాది లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ వైఎస్ ఎస్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఫెనోమ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాయిరెడ్డి నాంచారయ్య తమ మాతృమూర్తి సూర్యకాంతం స్మృతికి గుర్తు గా బాయిరెడ్డి ఫౌండేషన్, ఫెనోమ్ సంస్థల సిబ్బంది, విద్యార్థులు వెయ్యి పండ్లు జాతి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని కోరారు. జాతీయస్థాయిలో తల్లికి వందనం పేరుతో చాలామంది మొక్కలు నాటుతున్నారు అని పేర్కొన్నారు. ఇది మంచి సాంప్రదాయమని దీనిని ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించాలన్నారు. మొక్కలు నాటడమే కాదు దాన్ని పెంచే బాధ్యత కూడా మనదే అని వివరించారు. పక్షులు గూళ్ళు పెట్టుకునే, ఔషధలు అందించే, పండ్లు కాయలు అందించే దేశీయ మొక్కలను విరివిగా పెంచాలని ఆయన కోరారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలనె ఆలోచనతో తమ విద్యాలయంలో కూడా కూరగాయలు పండిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఫెనోమ్ సంస్థ ప్రతినిధి పిండి శ్రీనివాస్ మాట్లాడుతూ బాయిరెడ్డి ఫౌండేషన్ నుండి తాము ఈరోజు జామ, నిమ్మ, సపోటా, రామాఫలం, సీతాఫలం, మామిడి, పనస, కొబ్బరి తదితర మొక్కలు నాటామన్నారు. తమ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాంచారయ్య వాళ్ళ అమ్మ బాయిరెడ్డి సూర్యకాంతం జీవితంలో చాలా సేవలు అందించారని, ఆమె గుర్తు గా తమ ఎండి సైతం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ సెక్రటరీ జె.వి. రత్నం, జవహర్ నవోదయ విద్యాలయం సిబ్బంది, ఫెనోమ్ సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వస్త్ర సంచులు పంపిణీ చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles