కేజీహెచ్ గోషా హాస్పిటల్ సదుపాయాలు పై అసెంబ్లీలో ప్రస్తావించిన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

by vvwnews.com

*కేజీహెచ్, గోషా హాస్పిటల్ లో పలు సదుపాయాలు కల్పనపై అసెంబ్లీలో ప్రస్తావించిన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*తగిన సిబ్బందిని, హాస్పిటల్ లో పురాతన భవనాల ఆధునికరణ పై దృష్టి సారించారని కోరిన ఎమ్మెల్యే*

*కేజీహెచ్, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ లో మిషనరీ సదుపాయాలు, అదనపు భవనాలు కల్పించాలని కోరిన ఎమ్మెల్యే*

*ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఆధనంగా క్లాస్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే*

*నర్సింగ్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే*

విశాఖపట్నంలో కేజీహెచ్, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో ఎంతో పురాతనమైనవని, 30 పడకలతో కేజీ హాస్పిటల్ ప్రారంభం కాగా, ఈరోజు 2000 పడకలతో ఉందని అయినప్పటికీ తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల, 150 ఏళ్ల చరిత్ర గల హాస్పిటల్ లో బిల్డింగ్స్ లో లీకేజీలు, రిపేర్లు వల్ల మరియు పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. హాస్పిటల్ లో తగినంత మిషనరీ సదుపాయాలు లేవని, ఉదాహరణకు గుండె విభాగంలో 1998లో గుండె సంబంధించిన సంబంధించిన మిషనరీ హిందుస్తాన్ షిప్ యార్డ్ సహకారంతో అందజేశారని, అది పనిచేయకపోయినా తర్వాత గత ప్రభుత్వం రెంటల్ తో మిషన్ తెచ్చారని, గత ప్రభుత్వం 15, 20 మెడికల్ కాలేజ్ తెచ్చిందని గొప్పలు చెప్పుకుంటుందని కనీసం గుండెకు సంబంధించిన మిషన్ పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు కూడా కనీస సదుపాయాలు లేవని ఇకనైనా మన ప్రభుత్వం గుండెకు సంబంధించిన మిషన్ అందజేయాలని, అలాగే తగినటువంటి మిషనరీ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 33 హెడ్ నర్స్ పోస్టులు, 300 నర్సింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని తెలిపారు. నిరంతరం కేజీహెచ్ లో 4000 మంది ఓపిలుకు, 1500 ఐపీ పెషేంట్స్ ఉంటారని, హాస్పిటల్ కు పెట్ స్కాను, ఎం సి హెచ్ బిల్డింగ్, అత్యవసర విభాగాలు తో పాటు అనేక ఇబ్బందులు ఉన్నాయని వాటి పై కూడా ప్రత్యేక దృష్టి కనబరచాలని కోరారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో క్లాస్ రూమ్ అదనంగా మంజూరు చేయాలని చేయాలని కోరారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర మెడికల్ కళాశాల క్లాస్ రూమ్ వెంటనే మంజూరు చేయాలని తెలిపారు. అదేవిధంగా విక్టోరియా హాస్పిటల్ లో ఎంసిఎచ్ బిల్డింగ్ ఒకటి మంజూరు చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు చత్తీస్గడ్, ఒరిస్సానుంచి ఎంతోమంది పేదలు చికిత్స పొందుతున్నారని, కావున ఈ హాస్పిటల్ లో పూర్తిస్థాయిలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, హాస్పిటల్స్ ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఫైర్ ఆక్సిడెంట్లు అధికంగా జరుగుతున్నాయని అలాంటి సమయంలో మైనర్ గా సదుపాయాలు ఉన్నప్పటికీ మేజర్ గా ఇబ్బందులు ఎదురైతే ముంబై తీసుకువెళ్లే పరిస్థితి ఉందని, కనుక ఒక ప్రత్యేకమైన బ్లాక్ ను కేటాయించాలని తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యంగా నర్సింగ్ స్టాప్ ను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కేజీహెచ్, విక్టోరియా హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ప్రస్తావించారు…

Use Social Media to Spread the Word about Our News

related articles