ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ కి ప్రోత్సాహం
విశాఖపట్నంలో ‘ఘర్ ఘర్ సోలార్’ కార్యక్రమం ప్రారంభించిన టాటా పవర్ రెన్యువబుల్స్
విశాఖపట్నం:
భారతదేశపు పునరుత్పాదక విద్యుత్ రంగంలో అగ్రగామి, టాటా పవర్ యొక్క అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యువబుల్స్, విశాఖపట్నంలో తమ ఫ్లాగ్షిప్ ‘ఘర్ ఘర్ సోలార్’ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా
టాటా పవర్ ఎండీ డాక్టర్ ప్రవీర్ సిన్హా,
టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ సంజయ్ బంగా మాట్లాడుతూ
రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో లక్ష ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్(సౌర విద్యుత్తు) అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఏపీలో 14 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారని, కానీ వారిలో 45 వేల మందే ఇన్స్టాల్ చేసుకున్నారని తెలిపారు. ‘టాటా పవర్ రూఫ్ టాప్ సోలార్’ తీసుకుంటే 25 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందన్నారు. మధ్య తరగతి కుటుంబాల వారు కేవలం రూ.999తోనే దీనిని అమర్చుకునే సౌలభ్యం ఉందన్నారు. కేవలం 6 శాతం వడ్డీకే అన్ని ప్రధాన బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మొదటి ఐదేళ్లలో రుణం పూర్తిగా తీరిపోతుందని, మిగిలిన 20 ఏళ్లు ఉచితంగా విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చని వివరించారు. 20 రకాల మోడళ్లు అందుబాటులో ఉంచామన్నారు..ఈ సందర్బంగా నూతన టాటా సోలార్ ఉత్పత్తులను ఆవిష్కరించారు