మట్టి వినాయక ప్రతిమలను పూజించండి
– ప్లాస్టరాఫ్ ప్యారిస్ వద్దే వద్దు
– ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు
– పత్రి మొక్కలను పెంచండి
– జలగం కుమార్ స్వామి, జాతీయ కార్యదర్శి, భారతీయ కిసాన్ సంఘ్
మట్టి వినాయక ప్రతిమలను పూజించండి అని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమార్ స్వామి అన్నారు. శుక్రవారం ఉదయం ఎంవిపి కాలనీ లోని సమత డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒల నేతృత్వంలో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వ్యాపారులు తమ లాభాల కోసం ప్లాస్టరాఫ్ ప్యారిస్ తో తయారు చేసే ప్రతిమలు వద్దే వద్దన్నారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దన్నారు. వినాయక వ్రతం లో వినియోగించే పత్రి మొక్కలను సైతం నాటి పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ హితంగా జీవించే విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. చాలా రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుతున్నామన్నారు. ప్రతి విద్యార్ది నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు.
మట్టి వినాయక ప్రతిమలను పూజించండిప్లాస్టరాఫ్ ప్యారిస్ వద్దే వద్దుఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్
1