దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేద్దాం
– ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు
– పర్యావరణహితంగా జీవించుదాం
– వృక్షాబంధన్ కార్యక్రమం చేద్దాం.
-జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో
దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేయడం చాలా తేలిక పని, పర్యావరణానికి మేలు చేస్తుందని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. బుధవారం ఉదయం విశాఖ ఆటోమేటివ్ దగ్గర ఉన్న అక్షరా పబ్లిక్ స్కూల్లో, మిధిలాపూర్ లోని గ్లోబల్ స్కూల్లో, మారికవలస వద్ద ఉన్న ఇంటిల్లి విద్యాసంస్థలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్యంత్రణ మండలి నేతృత్వంలో, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో ఆధ్వర్యంలో దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేయించారు. ఆయా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం ఇంట్లో వినియోగించే మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పప్పులు, పెసలు, మినుములు, మినప గుళ్ళు, మనకు అందుబాటులో లభించే పక్షులు గూళ్ళు పెట్టుకునే చెట్ల విత్తనాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కల విత్తనాలు, పండ్ల జాతి చెట్ల విత్తనాలు వినియోగించి రాఖీలు తయారు చేయవచ్చు అని వివరించారు. మనకు కావలసిన, పక్షులు, వన్యప్రాణులు, చెట్లు, దేవుళ్ళ ఆకృతల ఇమేజెస్ మనకు అనువైన సైజులో తీసుకుని జిగురుతో విత్తనాలను దలసరి పేపర్ మీద అంటించడం ద్వారా రాఖీ తయారు చేయవచ్చని అన్నారు. పెద్ద పెద్ద రాఖీలను తయారు చేసి వందల ఏళ్ల నాటి మహావృక్షాలకు కట్టడం ద్వారా వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించి మహా వృక్షాలను అడవులను సమస్త జీవరాసిని కాపాడుకోవాలని ప్రజానికానికి అవగాహన కల్పించడం అవసరం అన్నారు. ఒకసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ తో తయారుచేసిన రాఖీలు వినియోగించవద్దని కోరారు.
అక్షర విద్యా సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, గ్రూప్ విచార సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, మారికవలస లోని ఇంటెల్లి విద్యాసంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో అనిత పలువురు ఉపాధ్యాయులు, పాల్గొని రాఖీలు తయారు చేశారు. యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ ఫెసిలిటేటర్ ఐ కృష్ణ కుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో కోఆర్డినేటర్ జె రాజేశ్వరి ఇతరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ తో రాఖీలువినియోగించవద్దని అక్షరవిద్యా సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత
6
previous post