రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ ప్రక్రియలో ఉపాధి కల్పనకు దోహదపడే సంస్థలకు,వ్యవస్థలకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రభుత్వ విప్,విశాఖ పర్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. శనివారం సాయంత్రం బీచ్ రోడ్ లోని అంబికా సీ గ్రీన్ హోటల్లో ఏర్పాటు చేసిన క్రూజ్ కాలినరీ అకాడమీ( CCA ) కార్యక్రమంలో యువతకు ఉపయుక్తంగా నిలిచే నాలుగు శాఖలను ఆయన ప్రారంభించారు. వీటికి సంబంధించిన లోగో పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ యువతకు విద్య, ఉపాధిని అందించే విధంగా కృషి చేస్తున్న సీసీఏ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు.యువతకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించే దిశగా కృషి చేస్తామని క్రూజ్ కాలినరీ అకాడమీ( సీ సీ ఏ ) వ్యవస్థాపకులు టేకి ప్రభాకర్, అదిబ రూహి సయ్యద్ లు తెలిపారు. దీనిలో భాగంగా తమ సంస్థ సీసీఏ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ విద్య అందించడం, గల్ఫ్ లో ఉద్యోగాలు కల్పించే ఏజెన్సీ ప్రారంభోత్సవం, విదేశీ విద్యలో యువతకు అవగాహన సహకారం అందించడం, నౌకల్లో ఉద్యోగాలు అందించే విధంగా ఓషన్ రిక్రూట్ రిక్రూట్మెంట్ జరిపే నాలుగు విభాగాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్తారని దీనికి అవసరమైన మార్గదర్శకం, సహకారాన్ని ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా అందిస్తామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాజియా తెలిపారు. సంస్థ ప్రిన్సిపాల్ బి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ సంస్థ లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు.కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
CCCA Group క్రూజ్ కాలినరీ అకాడమీ(సీ సీ ఏ) వ్యవస్థాపకులు టేకి ప్రభాకర్, అదిబ రూహి సయ్యద్ లు తెలిపారు
9
previous post