అంగరంగ వైభముగా స్వామి వారి నిత్య కల్యాణం* సింహాచలం

by vvwnews.com

*అంగరంగ వైభముగా స్వామి వారి నిత్య కల్యాణం*

సింహాచలం

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరముస్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles