ప్రకృతికి హాని కలిగించే పనులు చేయొద్దు
– మహావృక్షాలను పరిరక్షించండి
– అడవులను కాపాడండి
– విత్తన రాఖీలు తయారు చేయండి
డాక్టర్ ఎం వి వి మురళీమోహన్, అధ్యక్షులు, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ చాప్టర్
ప్రకృతికి హాని కలిగించే పనులు చేయొద్దు అని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ఎం వి వి మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఎంవిపి కాలనీలోని ఎస్ వి వి పి డిగ్రీ కాలేజ్ లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో ల నేతృత్వంలో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేయడం నేర్పిన తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహావృక్షాలను పరిరక్షించండి, అడవులను కాపాడండి అని కోరారు. విత్తన రాఖీలు తయారు చేయండి, భవిష్యత్తు తరాల జీవించడం కోసం భూమిని పర్యావరణహితంగా ఉంచండి అని పిలుపునిచ్చారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దె వద్దు, పర్యావరణ పరిరక్షణ కోసం మనం నిరంతరంగా కృషి చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఆధారిత సామగ్రితో తయారుచేసిన రాఖీలు వాడటం ఆనారోగ్యకరం అన్నారు. అందుకే తమ కళాశాలలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో కోఆర్డినేటర్ జె రాజేశ్వరి విత్తన రాఖీలు తయారు చేయడం పై శిక్షణ ఇచ్చారు.
ఎస్ వి వి పి డిగ్రీ కాలేజ్ లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి, విత్తన రాఖీలు తయారు చేశారు
7