కరెంటు స్మార్ట్ మీటర్ల వలన గతం కంటే నాలుగు రెట్లు ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందని వాటిని నివారించాలని

by vvwnews.com

కరెంటు స్మార్ట్ మీటర్ల వలన గతం కంటే నాలుగు రెట్లు ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందని వాటిని నివారించాలని వామపక్షాల డిమాండ్
విశాఖపట్నం

జగదాంబ జోన్ సిపిఎం పార్టీ కే గణేష్ ఆధ్వర్యంలో స్మార్ట్ మీట్లకు వ్యతిరేకంగా ఈరోజు నీలమ్మ వేపచెట్టు అల్లిపురం ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అంటించారు స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జగదాంబజోన్ పార్టీ కన్వీనర్ ఎం సుబ్బారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇదే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఇప్పుడున్న మంత్రి లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలుపునిచ్చిన లోకేష్ ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టించడం అన్యాయమని అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పయ్యావుల కేశవరావు ప్రభుత్వంపై కేసు వేయడం జరిగిందని అలాగే నేను ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో కనిపించలేదని స్మార్ట్ మీటర్లు పెడితే కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చి ప్రజలకు ఆర్థిక భారం ఎక్కువవుతుందని ఇప్పటికే నిత్యవసర వస్తువులు కొనుక్కో లేని పరిస్థితుల్లో ఉన్నామని దీన్ని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు సీనియర్ నాయకులు వై రాజు మాట్లాడుతూ కరెంటు బిల్లు విపరీతంగా వస్తే మనకు ఉన్న తెల్ల రేషన్ కార్డు రద్దు అవుతోందని తద్వారా అమ్మఒడి వృద్ధాప్య వికలాంగుల పింఛను రద్దయిపోద్దని అలాగే ఈ స్మార్ట్ మీటర్లు ఒక్క ఫేసు ఉన్న వాళ్ళకి 9000 త్రిబుల్ ఫేసులో ఉన్న వాళ్ళకి 15000 రూపాయల కలెక్ట్ చేస్తారని అలాగే ఇది ముందుగా చెల్లించవలసి వస్తుందని కరెంటు ఎక్కువ వాడుకున్న టైములో యూనిట్ రేట్ ఎక్కువగా వస్తుందని తద్వారా ఆర్థిక భారం పెరుగుతుందని ఇటువంటి అరాచక ప్రభుత్వం మోడీ ఏం చెప్తే తూచా తప్పకుండా పాటిస్తుందని ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రధాని లాంటి వాళ్లకి లాభం చేకూర్చటానికి వీకోటం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని అడ్డుకోవలసిన బాధ్యత ప్రజలదని వీధిలో ఉన్న ఒక్క ఇంటికు గాని ఈ స్మార్ట్ మీటర్లు వస్తే ప్రతి ఇంటికి వచ్చే అవకాశం ఉందని కాబట్టి ఒక్క ఇంటికి పెట్టడానికి ప్రయత్నించిన వీధి మొత్తం ఒక్కసారి ప్రతి ఒక్కరూ అడగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జగదాంబ సిఐటియు ప్రధాన కార్యదర్శి కర్రి చంద్రశేఖర్ చంద్రమౌళి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కే నర్సింగరావు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles