ఘనంగా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు
పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
జీవింఎంసి పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణి
విశాఖపట్నం :అఖిల భారత మాలమహానాడు మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పోర్టు కళావాణి లో శుక్రవారం జరిగిన జరిగిన వేడుకలకు పార్టీలకు అతీతంగా అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున విచ్చేసి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు శాలువాలు కప్పి ఆత్మీయ సత్కారం చేశారు. అభిమానుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్,విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త మెల్లి అప్పారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు తోట నగేష్, వెంకటరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మాలమహానాడు రాష్ట్ర ప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేకే రాజు మాట్లాడుతూ నిబద్దతతో పని చేసే వ్యక్తి మల్లేశ్వరి అని చెప్పారు. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. నాగమల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అభిమానులు వచ్చి శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా వుందన్నారు. పుట్టినరోజు సందర్బాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జీవింఎంసి పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణి చేశారు. కార్యక్రమంలో సిద్దు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
35