పర్యావరణ హితంగా విత్తన రాఖీలు తయారు చేద్దాం
– పర్యావరణ పరిరక్షణ కోసం విత్తన రాఖీలు
– వృక్షాబంధన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
– మహావృక్షాలను ఆకాపాడడం మన బాధ్యత
– శ్రీలక్ష్మి, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎపిపిసిబి
పర్యావరణ హితంగా విత్తన రాఖీలు తయారు చేద్దాం అని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీలక్ష్మి కోరారు. గురువారం ఉదయం విశాఖ మహానగరంలోని ఎంవిపీ కాలనీలో సమత డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో నిర్వహించిన విత్తన రాఖీల తయారీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తన రాఖీలు తయారుచేసిన విద్యార్థులను అభినందించారు . ప్లాస్టిక్ తో తయారుచేస్తున్న రాఖీల వల్ల కాలుష్యం పెరుగుతుందన్నారు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు విత్తనాల రాఖీలు తయారు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం విత్తన రాఖీలు అనే అంశాన్ని అందరూ గ్రహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మహావృక్షాలను కాపాడడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన, మహిళా సంఘాలతో కలిసి ముందడుగు వేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, వనమాలి సిటిజి అడ్మిన్ మళ్ళ సరిత ఇతర సభ్యులు, ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ కృష్ణ కుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ కోఆర్డినేటర్ రాజేశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు.
పర్యావరణ హితము గా విత్తన రాఖీలు తయారు చేద్దాం MVP కాలనీలో సమత డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీం
31