భీమిలి మండలంలోని కేజీబీవీ విద్యాసంస్థలొ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు అందజేసిన పండ్ల జాతి మొక్కలను

by vvwnews.com

మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి
– పండ్ల జాతి మొక్కలు నాటి ఆదాయాన్ని పొందండి
– మొక్కలు ఇవ్వడానికి మేము సిద్ధం.
– ప్రతి విద్యా సంస్థను ఒక తోటగా తీర్చిదిద్దండి
జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో
మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. ఆదివారం ఉదయం భీమిలి మండలంలోని కేజీబీవీ విద్యాసంస్థలొ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు అందజేసిన పండ్ల జాతి మొక్కలను గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ నేతృత్వంలో నాటడం జరిగింది. అనంతరం జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ పండ్ల జాతి మొక్కలు నాటి ఆదాయాన్ని పొందండి అని ఆయన కోరారు. పండ్ల జాతి మొక్కలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.ప్రతి విద్యా సంస్థను ఒక తోటగా తీర్చిదిద్దండి అని పిలుపునిచ్చారు
కేజీబీవీ విద్యాలయం ప్రిన్సిపాల్ గంగాకుమారి మాట్లాడుతూ తమ విద్యా సంస్థను ఒక నందనవనంగా తీర్చిదిద్దుతామన్నారు. తమ విద్యార్థులంతా పర్యావరణ హితంగా జీవించడానికి అవగాహన నిరంతరంగా వస్తున్నామన్నారు. విద్యార్థులంతా ప్రతిరోజు ఒక గంటపాటు మొక్కలు పెంచడానికి కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మాట్లాడారు

Use Social Media to Spread the Word about Our News

related articles