అమరావతిలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం

by vvwnews.com

-అమరావతిలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం

అమరావతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన యాబై వేల మంది మహిళలకు వైయస్ జగన్ ఇళ్ళ పట్టాలను ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిలబెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. వారికి నిలువ నీడ లేకుండా చేసి రోడ్డున పడేసిన మీరు ఈ రోజు అమరావతి మహిళ గురించి మాట్లాడుతున్నారు. అమరావతిలో రూ.5వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత వైయస్ జగన్‌ది. వైయస్ జగన్ మహిళలు అంటే అత్యంత గౌరవిస్తారు. వైయస్ జగన్ రామరాజ్యంను ప్రజలకు అందిస్తే, నేడు చంద్రబాబు రాక్షస పాలనను చూపిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారు.

-వైయస్‌ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుద కళ్యాణి గారు ….

Use Social Media to Spread the Word about Our News

related articles