హరే కృష్ణ మూవ్మెంట్ , విశాఖపట్నం
శ్రీ శ్రీ నరసింహ జయంతి పత్రిక ప్రకటన
తేదీ : 11–05-2025 , ఆదివారం సాయంత్రం 6 గంటలనుంచి
శ్రీ శ్రీ నరసింహ జయంతి శ్రీ నరసింహ యజ్ఞం, సీతమ్మ దార లో గల శ్రీ కృష్ణ మందిరం నందు ,నిర్వహించడంజరిగింది .
కార్యక్రమ వివరములు
సాయంత్రం 06:00 నుంచి 06:30 వరకు – శ్రీ నరసింహ యజ్ఞము
సాయంత్రం 06:30 నుంచి ౦౭.00 వరకు – పూర్ణహుతి & శాంతి వచనం
సాయంత్రం 07:00 నుంచి 07:30 వరకు – నరసింహా లీలా ప్రవచనం
సాయంత్రం 7:30 నుంచి 8 :00 వరకు – మంగళ హారతి & సంకీర్తన
8 :00 గంటలకు – తీర్థ ప్రసాద వితరణ
శ్రీ శ్రీ నరసింహ జయంతి ఉత్సవములను హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం వారు మాధవ దార లోని శ్రీ కృష్ణ మందిరం లో ఆలయ కమిటి అసోసియేషన్ సహకారం తో ఈ రోజు అనగా 11 వ తారీకు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ శ్రీ నరసింహ యజ్ఞమును భక్తుల సౌకర్యార్ధము నిర్వహించడం జరిగింది .
శ్రీ నరసింహ యజ్ఞం : శాస్త్ర బద్ధం గా యజ్ఞ కుండీని అలంకరించి వేద పండితులచే వేద మంత్రాలతో యజ్ఞం జరిగింది .
ఈ శ్రీ నరసింహ యజ్ఞము ముఖ్య ఉద్దశం ప్రపంచ శాంతి కొరకు నిర్వహించడం జరిగింది .శాస్త్రముల ప్రకారము సర్వదోష నివారిణి శ్రీ శ్రీ శ్రీ నరసింహ యజ్ఞము .
ప్రవచనం : శ్రీమాన్ నిష్కించన భక్త దాస ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ వారు భక్తులకు నరసింహ స్వామి అవతారం ప్రాముఖ్యతను గురించి భక్తులకు వివరించారు .
మంగళ హారతి : హరే నామ సంకీర్తనల తో శ్రీ నరసింహ స్వామివారికి ,మంగళ హారతి చేయడం జరిగింది .
ప్రసాద వితరణ : కార్యక్రమ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది
ఈ కార్యక్రమం నిర్వహణకు అనుమతి యిచ్చి సహకరించిన శ్రీ కృష్ణ మందిరం అసోసియేషన్ వారినీ శ్రీ యదురాజా గారు అభినందిచారు .
ఇట్లు
శ్రీ యదురాజా దాస
హరే కృష్ణ మూవ్మెంట్ , విశాఖపట్నం
9010611108
శ్రీ శ్రీ నరసింహ జయంతి శ్రీ నరసింహ యజ్ఞం, సీతమ్మ దార లో గల శ్రీ కృష్ణ మందిరం నందు జరిగింది
34