కళాభారతి – కీ॥శే॥ పైడా కౌషిక్ నాటకోత్సవములు – 2025
20వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు – 2025
ప్రెస్ మీట్ తేదీ: 10-4-2025 ఉదయం 9 గం.
వేదిక: కళాభారతి, విశాఖపట్నం
——————————
కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 10 ఏఫ్రియల్, 2025 న జరిగిన ప్రెస్ మీట్ సమావేశంలో వి.ఎమ్.డి.ఎ. మరియు నాటకోత్సవాల అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణరాజు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న నాటకోత్సవాలు, ఈ ఏడాది 12, 13, 14, 15 మరియు 16 ఏఫ్రియల్, 2025 తేదీలలో నిర్వహంచబడుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 28 ఎంట్రీలు ఈ ఏడాది వచ్చాయని, వాటినన్నింటిని ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి నాలుగు రోజులు, రోజుకు రెండు నాటికలు, చివరి రోజు 16-4-2025 తేదీన ఒక నాటిక ప్రదర్శించబడి, ఆ తరువాత వెంటనే బహుమతి ప్రదానోత్సవం జరుగునని వివరించారు.
వి.ఎమ్.డి.ఎ. ట్రస్టీ మరియు నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి శ్రీరామాదాస డా. జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు) మాట్లాడుతూ, ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానికేతర సమాజాలముల వారికి ప్రదర్శన పారితోషికం రూ॥ 16,000/- లతో పాటు లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ॥ 4000/- అదనంగా అందజేయబతున్నదని, మరియు ప్రదర్శన రోజున మాత్రం వీరికి వసతి ఉచితంగా ఏర్పాటు చేయబడుతున్నదని తెలిపారు. ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానిక సమాజాలముల వారికి ప్రదర్శన పారితోషికం రూ॥16,000/- లతో పాటు అదనంగా లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ॥ 2000/- అందజేయబతున్నదని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి, ఉత్తమ ప్రదర్శనకు రూ॥18,000/-లు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥15,000/-లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥12,000/- లు చతుర్థ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 10,000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ఇవిగాక 12 వ్యక్తిగత బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1500/-లు మరియు జ్ఞాపికలు అందజేయబడుతాయని, మూడు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ప్రోత్సాహక బహుమతుల క్రింద నాటికలలో పాల్గోన్న ప్రతి బాల, నటీ నటులకు రూ॥ 1000/- లు నగదుతో పాటు జ్ఞాపికలు బహూకరించబడతాయని, ఈ పోటీలలో ప్రదర్శించిన ప్రతి నాటిక రచయిత, దర్శకుడికి Multi coloured laminated Certificates లను నాటిక ప్రదర్శన అనంతరం, వేదిక మీద అందజేయబడుతాయని తెలియజేశారు.
నాటకోత్సవాల మహారాజపోషకులు
శ్రీ పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు నేలమీద ప్రఖ్యాతిగాంచిన ఈ నాటకోత్సవాలకు మహారాజపోషకులుగా వుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తనవంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. అన్ని రోజులు నాటికల ప్రదర్శనలకు ప్రవేశం ఉచితమని, వచ్చిన ప్రేక్షకులకు ప్రతిరోజు లాటరీ తీసి 1st, 2nd & 3rd బహుమతులు ఏ రోజుకారోజు నాటికల ప్రదర్శనల అనంతరం ఇవ్వబడుతాయని, మరలా అన్ని రోజులకు (5 రోజుల కూపన్లు) కలిపి 1st, 2nd, 3rd & 4th బహుమతులు ఇవ్వబడుతాయని తెలియజేశారు. నాటకోత్సవాల చీఫ్ కన్వీనర్ డా॥ కె.జి. వేణు, నాటకోత్సవాలలో ఏర్పాటుచేస్తున్న మహాప్రాంగణకర్త డాక్టర్ (శ్రీమతి) ఎ. మంగళగౌరిగారు మరియు రోజువారి ప్రాంగణకర్తల వివరాలను అందజేశారు.. ఛీఫ్ అడ్వైజర్ ఆచార్య బాబివర్ధన్ మాట్లాడుతూ, ఈ నాటకోత్సవాల విజయంలో పాత్రికేయుల పాత్ర చాలా విశిష్టమైనదని, ఈ ఉత్సవాల సమాచారాన్ని రెండు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల వారికి తెలియజేసే బాధ్యతను పాత్రికేయమిత్రులు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్ కన్వీనర్స్ శ్రీ బొడ్డేటి జగత్ రావు, శ్రీ వర్రె నాంచారయ్యలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు, పట్టణంలోని ఎలక్ట్రాన్ మీడియా మరియు ప్రింటు మీడియా ప్రతినిధులందరూ పాల్గొన్నారు