ఎమ్.వి.పి.కోలనీ సెక్టారు-3 ధర్మశక్తినగర్ లో వెలసి యున్న శ్రీ షిరిడి సాయి మందిర్ ఆవరణలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నారు. పానకం, వడపప్పు , చలిమిడి తదితర ప్రసాదాలను. స్వామి వారికి నివేదించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉమామహేశ్వరావు మాట్లాడుతూ స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించి సర్వ సౌభాగ్యాలు పొంది, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో విరాజిల్లాతారన్నారు శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శతృఘ్ను సమేతుడైన శ్రీరామ చంద్రమూర్తి ఆలయ కమిటీ ప్రతినిధులు సూర్యప్రకాష్, గుప్తా, డి వెంకటేశ్వరావు, పీ ఎ వి రాజు, వై ఆర్ ఎస్, ఎస్, కుమార్ లు మాట్లాడుతూ ప్రతి ఏటా ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. స్వామి వారి కళ్యాణం, బాబా మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్నసమారాధన చేశారు. కార్యక్రమం లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్.వి.పి.కోలనీ సెక్టారు-3 ధర్మశక్తినగర్ శ్రీషిరిడిసాయి మందిర్ ఆవరణలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం
39