12నజరగబోయే హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీ దక్షిణ నియోజకవర్గం బీజేపీ వాసుపల్లి సంతోష్ పిలుపునిచ్చారు

by vvwnews.com

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏప్రిల్ 12 న జరగబోయే హనుమాన్ విజయోత్స శోభాయాత్ర, బైక్ ర్యాలీ విజయవంతం చెయ్యాలని దక్షిణ నియోజకవర్గం బీజేపీ నాయకుడు వాసుపల్లి సంతోష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం లో ఆర్ఎస్ఎస్, కూటమి నాయకులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తారీకున జరగబోయే బైక్ ర్యాలీ,శోభయాత్ర కోసం విజయవంతం చేయడానికి అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని సభ్యులను కోరారు. ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ రూట్ మ్యాప్ అంతా సిద్దమైందన్నారు. తామంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 12 న జరిగే ఈ కార్యక్రమం లో అందరూ భాగస్వామ్యూలై శోభా యాత్ర, బైక్ ర్యాలీ జయప్రదం చెయ్యాలని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles