43
*పెన్షన్లు అందించిన గంటా*
మధురవాడ, ఏప్రిల్ 1జీవీఎంసీ 5 వ వార్డు శివశక్తి నగర్ 70, 71 సచివాలయాల పరిధిలో పెన్షన్ దారులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం పెన్షన్లు అందించారు. పెన్షన్ తీసుకున్న వృద్ధుల యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అధికారులకు సూచించారు. జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, కార్పొరేటర్ మొల్లి హేమలత, మొల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు
(–###–)