మాజీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి మహిళా మహిళా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేశారు

by vvwnews.com

*మహిళా జర్నలిస్టుకు “వాసుపల్లి” చేయూత*…

– *జర్నలిస్టులకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి*..

– *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*

గత కొన్నిరోజులుగా అనారోగ్య కారణంగా ఇబ్బంది పడుతున్న *వైజాగ్ ఫోకస్ రిపోర్టర్ జయశ్రీ మెడికల్ ఖర్చులకు రూ. 5000 మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ చేయూతన అందించారు. ఇటు దక్షిణ పేద ప్రజలతోపాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్న వాసుపల్లి గణేష్ కుమార్ జర్నలిస్టుల కష్టనష్టాలలో సాయం మందిస్తున్నారు*. తాను చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఆసీలమెట్ట కార్యాలయంలో *మహిళా జర్నలిస్టుకు సొంత నిధులతో రూ.5000లు నగదు అందజేశారు. శస్త్ర చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు*. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకి తోడుగా ఉంటానన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు సెంట్లు స్థలం, హెల్త్ కార్డు లు, అక్రిడేషన్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ విశాఖ జిల్లా సెకరెటరీ గురజాపు రవి, సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ ,30 వార్డ్ అధ్యక్షులు దశమంతులు మాణిక్యాలరావు, 30వ వార్డ్ ఇన్చార్జ్ దశమంతుల చిన్ని ,పాత్రోజు అర్జున్ ప్రసాద్, వేణు,సాగర్, గంగళ రామరాజు, చింతకాయల వాసు, చేపల రాజు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles