విశాఖలో వాటర్ ప్రూఫ్ ఒప్పో ఎఫ్ 29 ఆవిష్కరణ టెక్నాలజీకి ప్రాధాన్యత నిస్తూ వివిధ సంస్థలను ప్రోత్సహిస్తున్న ఒప్పో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అనేక ఆవిష్కరణలు చేపడుతున్నట్టు ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ (కమ్యూనికేషన్) క్షితిజ్ అరోరా తెలిపారు. సోమవారం విశాఖలోని బీచ్ రోడ్ లో ఒక హోటల్లో ఒప్పో ఎఫ్ 29 ఆవిష్కరణ చేశారు. విలక్షణ వాతావరణాన్ని తట్టుకునే రీతిలో ఒప్పో f 29 భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడిందని ఆరోరా తెలిపారు. దీని ప్రారంభ ధర 23,999,( 8+128 జిబి ), f29 pro 25,999 (8+256జిబి )ను అందుబాటులో ఉంచామన్నారు. తీవ్రమైన ఎండ లేదా తీవ్రమైన చలి మంచు కలిగిన ప్రాంతాల్లో సైతం మొబైల్ ఫోన్ సక్రమంగా వినియోగించే రీతిలో అత్యంత మన్నిక వస్తుందన్నారు. భారతదేశంలోని బెంగళూరుకు చెందిన సొసైటీ జనరల్ సర్వేలెన్స్ దీనిని నీటి నిరోధ కోసం పరీక్షించి సామర్థ్యాన్ని నిరూపించారని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఒప్పో ఇండియా ఛాంపియన్ సిరీస్ గా మంచి నెట్వర్క్ తో ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ మిలటరీ గ్రేడ్ దృఢత్వం కలిగిన ఫోన్ గా అభివర్ణించారు. ఇది అత్యంత సన్నగా 7.65 ఎంఎం తో 185 గ్రాముల కన్నా తక్కువ బరువు కలిగి 1200 నీట్ స్పీక్ బ్రైట్నెస్ తో ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.నూతన టెక్నాలజీతో నీరు, వేడి, చల్లని పదార్థం వంటివి ఫోన్ పై పడినప్పటికీ ఎటువంటి డ్యామేజీ కలగకుండా, పడిపోయినప్పుడు విరిగిపోకుండా ఉండే అత్యధిక టెక్నాలజీని వినియోగించి ఆవిష్కరించిన f 29 ఫోన్ గురించి వివరించారు.
34
previous post