ఎకో వైజాగ్ ని జయప్రదం చేయండి
-ప్రతీ ఒక్కరూ తమ పుట్టినరోజు ఒక మొక్క నాటి పెంచండి
– పశుపక్ష్యాదులకు తాగునీరు అందుబాటులో ఉంచండి
– వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలి
– ఒక్క సారి వాడి వదిలేసె ప్లాస్టిక్ వద్దే వద్దు
-జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ.
ఎకో వైజాగ్ ని జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శిజెవి రత్నం కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం పెందుర్తి లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో తన పుట్టిన రోజు సందర్భంగా ఆరు మొక్కలు నాటిన అనంతరం ఆతవ సత్యవతి నేతృత్వంలో పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రధానంగా పదవ తరగతి విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులతొ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకొవైజాగ్, స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్రా, స్వచ్చ భారత్ లు విజయవంతంగా అమలు చేయాలని కోరారు.అలాగే ఈ వేసవి కాలంలో పశుపక్ష్యాదులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులు అందరూ తమ బాధ్యతగా నీరు రోజూ ఏర్పాటు చెయ్యాలన్నారు. వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలని, వేసవికాలం తర్వాత వాటిని కొండల మీద, తీర ప్రాంతంలో వేసి సామాజిక వనాలు పెంచాలని కోరారు. వంటింటి వ్యర్ధాలను ఎరువుగా తయారు చేసి వసతి గృహంలో ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం చూసి ఆయన అభినందించారు.
హాస్టల్ వార్డెన్ సత్యవతి మాట్లాడుతూ భూమి మీద జీవించె సమస్త జీవులకు మనం నీరు అందుబాటులో ఉంచాలని కోరారు. పశుపక్ష్యాదుల కోసం మంచి నీళ్ళు అందించేందుకు మట్టి పాత్రలు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ఏర్పాటు చేయడం ఆనందదాయకం అన్నారు. తమ విద్యార్దులు చాలా మంది ఇప్పటికే మట్టి పాత్రలలొ నీరు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ కోసం తాము పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి, ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఎకో వైజాగ్ ని జయప్రదం చేయండిప్రతీ ఒక్కరూ తమ పుట్టినరోజు ఒక మొక్క నాటి పెంచండి గ్రీన్ క్లైమేట్ టీం
39