వైజాగ్ : ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల‌లో జ‌ర‌గ‌బోయే రెండు ఐపీఎల్ మ్యాచులు వైజాగ్ కి గ‌ర్వ‌కార‌ణంగా

by vvwnews.com

అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచుల నిర్వ‌హ‌ణ‌కు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సిద్ధం : ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్లానింగ్ అండ్ ప్రిపరెడ్నెస్ మీట్
మీడియాతో మాట్లాడిన ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని
BCCI, ఢిల్లీ క్యాపిటల్స్, వైజాగ్ జిల్లా క‌లెక్ట‌ర్ హరేంధీర ప్రసాద్ తో సమావేశం

వైజాగ్ : ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల‌లో జ‌ర‌గ‌బోయే రెండు ఐపీఎల్ మ్యాచులు వైజాగ్ కి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచేలా నిర్వ‌హిస్తామ‌ని ఆంధ్ర‌క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఐపీఎల్ మ్యాచుల వివ‌రాలు, ఈ మ్యాచ్ నిర్వహించేందుకు చేప‌ట్టిన ఆధునీక‌ర‌ణ ప‌నులు తెలియ‌జేసేందుకు మంగ‌ళ‌వారం వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్లానింగ్ అండ్ ప్రిపరెడ్నెస్ మీట్ జ‌రిగింది. అనంత‌రం గ్రౌండ్ లో చేప‌ట్టిన ఆధునీకర‌ణ ప‌నులు ప‌రిశీలించారు. అలాగే గ్రౌండ్ లో ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంక బత్ర బాగ్చి బ్యాట్ చేత ప‌ట్టుకుని స‌ర‌దా కాసేపు క్రికెట్ ఆడి సంద‌డి చేశారు.

అనంత‌రం ప్లానింగ్ అండ్ ప్రిపరెడ్నెస్ మీట్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఈ మ్యాచులు నిర్వ‌హించేందుకు స‌హ‌క‌రించిన బిసిసిఐ వారికి, వైజాగ్ స్టేడియం హోమ్ గ్రౌండ్ గా ఒప్పుకున్నందుకు డిల్లీ క్యాపిటల్స్ యాజ‌మాన్య సంస్థ జిఎమ్ఆర్ గ్రూప్ కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ స్టేడియంలో
మార్చి 24న తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్ తో, మార్చి 30న ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తో త‌ల‌ప‌డుతుంద‌న్నారు. డిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్‌గా విశాఖ స్టేడియం ను సిద్దం చేసిన‌ట్లు ప్ర‌క‌టించ‌రు.

ఢిల్లీ క్యాపిటల్స్ ను వైజాగ్ లో మ్యాచులు ఆడేందుకు చాలా క‌ష్టప‌డి ఒప్పించిన‌ట్లు తెలిపారు. వారు ముఖ్యంగా గ్రౌండ్ లోని ఫ్ల‌డ్ లైట్స్ స‌మ‌స్య గురించి చెప్పారు. అలాగే బ్యాక్సులు లేవ‌న్నారు. వారు కోరిన విధంగా అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ స్టేడియాన్ని రెండు నెలల్లో ఆధునీక‌రించ‌టం జ‌రిగింద‌న్నారు.

దేశంలో క్రికెట్ కి విప‌రీతంగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో దేశంలోని అన్ని స్టేడియాల‌ను ఆధునీక‌రిస్తున్నారు. అందుత‌గ్గ‌ట్లుగానే ఈ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్స్ దగ్గ‌ర‌నుంచి అన్ని ఆధునీక‌రించిన‌ట్లు చెప్పారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అన్ని ప‌నులు పూర్తి చేశాము….మిగిలిన ప‌నులు సెకండ్ ఫేజ్ లో పూర్తి చేసి మిగిలిన రాష్ట్రాల్లో వున్న క్రికెట్ స్టేడియాల కంటే ధీటుగా అన్ని సౌక‌ర్యాలు వ‌సతులు వుండే విధంగా ఈ గ్రౌండ్ ను త‌యారు చేసి చూపిస్తామ‌న్నారు.

క్రికెట్ క్రీడాకారుల‌కు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయ‌టంతోపాటు ప్రేక్ష‌కుల కోసం గ్యాల‌రీల‌ను ఆధునీక‌రించ‌టం జ‌రిగిందన్నారు. గ్రౌండ్ లో 250 టాయిలెట్స్ ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ముఖ్యంగా ఆధునీక‌ర‌ణ‌లో భాగంగా గ్రౌండ్ మొత్తం ఎల్‌ఈడీ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌ని ఇందుకోసం దాదాపు రూ9.5 కోట్లు ఖ‌ర్చుపెట్టిన‌ట్లు తెలిపారు. గ్రౌండ్ ఆధునీక‌ర‌ణ కోసం దాదాపు 40 కోట్ల రూపాయాలు ఖ‌ర్చు అయింద‌న్నారు. ఈ ఖ‌ర్చు మొత్తం రెండున్నర ఏళ్ల‌లో రాబ‌ట్టే విధంగా ప్ర‌ణాళిక సిద్దం చేసిన‌ట్లు చెప్పారు.

బిసిసిఐ ఈ గ్రౌండ్ ను అంత‌ర్జాతీయ స్థాయిలో ఆధునీక‌రిస్తే మ‌రిన్నీ మ్యాచులు ఈ గ్రౌండ్ లో జ‌రిగే విధంగా స‌హ‌క‌రిస్తామ‌ని బిసిసిఐ మాట ఇచ్చిన‌ట్లు తెలిపారు. మంగ‌ళవారం ఉద‌యం బిసిసిఐ ప్ర‌తినిధులు, ఢిల్లీ క్యాపిటల్స్ ప్ర‌తినిధులు, వైజాగ్ జిల్లా క‌లెక్ట‌ర్ క‌లెక్ట‌ర్ హరేంధీర ప్రసాద్, ఇత‌ర జిల్లా ప్రభుత్వ అధికారులతో పాటు ఎసిఏ అపెక్స్ బాడీ తో స‌మావేశం జ‌రిగిందని ఆ స‌మావేశంలో జిల్లా అధికారుల‌తో మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ‌పాల‌నలో గాడి త‌ప్పిన రాష్ట్రాన్ని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం గాడి పెడుతుంద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వానికి త‌మ స‌హ‌కారం ఎప్పుడు వుంటుంద‌ని తెలియ‌జేశారు.

అనంతరం విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంక బత్ర బాగ్చి మాట్లాడుతూ క్రీడకారుల‌కి ప్రేక్ష‌కుల‌కి ఎలాంటి అవాంత‌రాలు క‌ల‌గ‌కుండా ప‌టిష్ట భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిసిపి అజిత వెజెండ్ల‌, డిల్లీ క్యాపిట‌ల్స్ నుంచి సిద్దార్థ్, గౌత‌మ్, బిసిసిఐ నుంచి అభ‌య్, ఎసిఎ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్ , ఏ.సి.ఏ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామ ప్రశాంత్ , కోశాధికారి దండుమూడి శ్రీనివాస్ , కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్ ల‌తో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ నాయ‌కులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles