VAGDEVI SCHOOL NATIONAL SCIENCE DAY CELEBRATIONS 2025.

by vvwnews.com

వాగ్దేవిలో ఘనంగా జాతీయ సైన్స్ డే —–
అక్కయ్యపాలెం వాగ్దేవి పాఠశాలలో శాస్త్రవేత్త సర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ డే ని ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని యూఎస్ఏ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లాడ రాజశేఖర్ ప్రారంభించారు . అనంతరం ఆయన విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశ స్థాయిలో శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని సేవలందించిన సర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయస్థాయి సైన్స్ డే ను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు . భారతావని రక్షించే విధంగా భవిష్యత్ తరానికి శాస్త్రవేత్తలుగా వాగ్దేవి విద్యార్థులు ఎదగాలని అన్నారు .1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రకృతికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సౌర విద్యుత్ శక్తి , ఎలెక్ట్రానిక్ , ఎలక్ట్రికల్ , త్రాగునీరు , వ్యవసాయము , జాతీయ చిహ్నాలను మరియు విభిన్న అంశాలతో కూడిన వివిధ రకాల 60 నమూనాలను ప్రదర్శించి వారి ప్రతిభను చాటుకున్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం వి వి సత్యనారాయణ , వైస్ ప్రిన్సిపల్ ఎం ఎస్ ఎల్ శైలజ , ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎం వి రాజశేఖర్ ద్వారకా నగర్ లైన్స్ క్లబ్ సభ్యులు పాఠశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలోె పాల్గొన్నారు .

Use Social Media to Spread the Word about Our News

related articles