శివలింగానికి స్వయంగా పూజ చేసే భాగ్యంవిశాఖ అంటేసుబ్బరామిరెడ్డి .. సుబ్బరామిరెడ్డి అంటే విశాఖ

by vvwnews.com

టి శివలింగానికి స్వయంగా పూజ చేసే భాగ్యం

విశాఖ అంటే సుబ్బరామిరెడ్డి ..
సుబ్బరామిరెడ్డి అంటే విశాఖ

ఈసారి కుంభమేళా గంగా నదీ జలాలతో భక్తులు శివలింగానికి అభిషేకించే అవకాశం

—– రామకృష్ణ బీచ్ లో మహా శివలింగాన్ని దర్శించుకున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

విశాఖపట్నం : విశాఖ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ప్రముఖ వ్యక్తి టి.సుబ్బరామిరెడ్డి అని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. విశాఖ అంటే సుబ్బరామిరెడ్డి… సుబ్బరామిరెడ్డి అంటే విశాఖ అన్నట్టుగా ఆయన ఖ్యాతి పొందారన్నారు.

నిస్వార్థపరుడైన టి.సుబ్బిరామి రెడ్డి లోక కళ్యాణం కోసం పాటుపడుతుండడం అతడికి మాత్రమే సాధ్యమైంది అన్నారు. విశాఖ సాగర తీరంలో మహా శివ రాత్రి సందర్భంగా సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన మహా శివలింగాన్ని బుధవారం ఉదయం బి.వి.రామ్ దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహా శివరాత్రి సందర్భంగా గడచిన 40 సంవత్సరాలుగా కళాబంధు, అజాతశత్రువు విశాఖ సాగర తీరంలో భారీ శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారన్నారు. ఇక్కడి శివలింగానికి భక్తులు స్వయంగా పూజలు చేసే అవకాశం ఉండడంతో.. విశాఖపట్నం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారు. అంతేకాకుండా ఈసారి మహా శివలింగం విశిష్టతను మరింత పెంచే విధంగా సుబ్బరామిరెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం.. కుంభమేళా కొనసాగుతున్న గంగా నది నుంచి పవిత్ర జలాలను విశాఖ తీసుకొచ్చారన్నారు. స్వయంగా కుంభమేళాలో పాల్గొనే అవకాశం లేనివారు విశాఖ సాగర తీరంలో సుబ్బరామిరెడ్డి ఏర్పాటుచేసిన మహాశివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం సంప్రాప్తిస్తుందని పేర్కొన్నారు.

*సుబ్బరామిరెడ్డి వల్లే విశాఖ సుభిక్షం*

కళాబంధు సుబ్బిరామిరెడ్డి చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కారణంగానే విశాఖపట్నం సుభిక్షంగా ఉందని బి.వి.రామ్ అభివర్ణించారు. విశాఖ నగరానికి హుద్ హుద్ లాంటి మహా భయంకరమైన తుఫాన్ల ను నియంత్రించడంతోపాటు.. సునామి తీవ్రతను కూడా గణనీయంగా తగ్గించడంలో సుబ్బరామిరెడ్డి పాత్ర పరోక్షంగా ఉందని బి.వి.రామ్ పేర్కొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles