గ్లోబల్ పింక్ ఆర్మీ ఆధ్వర్యంలో
మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్
విశాఖపట్నం : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం
తేన్నేటి పార్కులో గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు మహిళలు తమను తాము ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలన్న అంశంపై డెమో ప్రదర్శించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన కమాండర్ విష్ణు కుమార్ వీరికి ఆయా అంశంలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా శ్రీమతి కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖ శాఖ ఏ లక్ష్యం తో ఏర్పాటు చేసామో అందులో భాగంగా తొలి కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆత్మరక్షణ మహిళలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయం స్థాయి వరకు కళాశాల ప్రాంగణాల్లో మహిళల భధ్రతకు, హింసను నివారించేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను వివరిస్తూ అవగాహనా సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. పిబ్రవరి 4 తేదీన ఆశీల మెట్ట వద్ద నున్న మల్ బార్ గోల్డ్ షో రూమ్ లో మహిళలు ఆత్మ రక్షణ అంశంపై అవగహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇండియన్ ఆర్మీ కి చెందిన కమాండర్ విష్ణు కుమార్ మాట్లాడుతూ మహిళలు గతంలో కంటే ఇప్పుడు ఆత్మరక్షణ నేర్చుకోవాలని ప్రస్తుతం ప్రతి మహిళలు తమను తాము రక్షించుకొనే విధానాన్ని నేర్చుకోవడం అవసరం అన్నారు. సులువైన మెలకువలు తెలుసుకోవడం ద్వారా వారిని వారి రక్షించుకో గలుగుతారన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ మెంబెర్స్ త్రివేణి, రేణుక, సత్యకుమారి, బషిరా, గీత, ప్రత్యాష, సంధ్య, ప్రవీణ్ పాల్గొన్నారు