*_నాస్తికవాది డాక్టర్ జయగోపాల్ కు ప్రతిష్టత్మక పెరియార్ అవార్డు_*

by vvwnews.com

విశాఖపట్నం

*_నాస్తికవాది డాక్టర్ జయగోపాల్ కు ప్రతిష్టత్మక పెరియార్ అవార్డు_*

*_మానవహక్కుల పరిరక్షణకై చేసిన కృషికి ఫలితం-జయగోపాల్_*

ప్రముఖ నాస్తికవాది, అంతర్జాతీయ హక్కుల నాయకులు, భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ కు వారి మరణానంతరం చెన్నైలోని ద్రవిడ కజగం, పెరియార్ తమిళ్ ఫోరం చే ప్రముఖ సాంఘిక ఉద్యమకారుడు పెరియార్ అవార్డును ఈనెల 15న ద్రవిడ కజగం నాయకులు డాక్టర్ కె వీరమణి అందించినట్లు భారత నాస్తిక సమాజం నాయకులు టి శ్రీరామ్మూర్తి, వై. నూకరాజు మరియు జె రవి, విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారన్నారు. 1972లో డాక్టర్ జయగోపాల్ చే స్థాపించబడ్డ భారత నాస్తిక సమాజం దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో విరివిగా మూఢనమ్మకాల నిర్మూలనకై, హక్కుల సాధనకై విరివిగా కృషి చేసిందని, దేశంలోని దళితులపై, స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, మానవహక్కుల పరిరక్షణకై చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక పెరియార్ అవార్డును అందించడం జరిగిందని వారు అన్నారు. అవార్డు ఇవ్వడం ద్వారా భారత నాస్తిక సమాజం యొక్క బాధ్యతను మరింతగా ప్రోత్సహించిందని, ఆ స్ఫూర్తితో, ప్రేరణతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మూఢనమ్మకాల పేరుతో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను నిరోధించడానికి, ప్రజలలో శాస్త్రీయ భావనను కల్పించడానికి పాటుపడుతుందన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles