త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్: కళాభారతి – విశాఖపట్నం
తేదీ: 12-01-2025
త్యాగరాజ అరాధన ట్రస్ట్ 3 దశాబ్దాలుగా త్యాగరాజ అరాధన ఉత్సవాలు ఘనంగా జరుపుతోంది. మొదట 3రోజులు, తరువాత 4 రోజులు అలాగ పెంచాతూ ఈ ఏడాది 7 రోజులు ఘనంగా చేస్తున్నాము. దీన్నిబట్టి సంగీతం పట్ల అత్యంత శ్రద్ధ చూపుతూ సంగీత మళ్ళీ బాగా ప్రచుర్యం లోకి రావడానికి కళాభారతి ట్రస్ట్ ఆశయాలకు అనుగుణంగా చేస్తున్న కృషి సఫళీకృతం అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
ముందుగా 2025 ఉత్సవాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు శ్రీ M. S. N. రాజు, కార్యదర్శి శ్రీరామాదాస Dr రాంబాబు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శ్రీ పంతుల గోపాలరావు, ట్రస్టీలు పైడా కృష్ణ ప్రసాద్, శ్రీమతి. మల్లిక గ్రంధి . M. S.. శ్రీనివాస్, V. V. రమణమూర్తి,విడుదల చేసేరు.
ఈ సంవత్సరం 2025 ఉత్సవం ముఖ్యాంశాలు మరియు వివరాలు
ఆరంభోత్సవం: 17 జనవరి 2025, సాయంత్రం 6:15 గంటలకు
ముఖ్య అతిథిగా
తమిళనాడు సంగీత & లలిత కళల విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి వీణా ఈ. గాయత్రి, ప్రముఖ వీణ విద్వాన్సురాలు వస్తున్నారు.
జనవరి 17 సాయంత్రం 6:15 జరిగే ప్రారంభోత్సవ సభలో ప్రతీ ఏడాది ఇచ్చే ప్రతిష్టత్మాక “సంగీత కళాభారతి” బిరుదు, పట్టు వస్త్రాలు, ప్రశంసాపత్రం, కాష్ అవార్డు ₹ 10,000/- ఈ ఏడాది ప్రముఖ నాదశ్వర విద్వాన్సులు శ్రీ గురువిళ్ల అప్పన్న కు ఇచ్చేందుకు నిర్ణయించడమైనది.
ప్రారంభ సభ అనంతరం గొప్ప సంగీత కార్యక్రమం, హంస అకాడమీ,విశాఖపట్నం,
అధ్యాపకులు, విద్యార్థులు చే త్యాగరాజ కీర్తనలతో కూర్చిన ” సంగీత సాహిత్య సద్భక్తి సమన్వయం ” కార్యక్రమం ఉంటుంది.
రెండవ రోజు (18 జనవరి 2025) ఉదయం 7 గం లకు స్థానిక త్యాగరాజ ఆలయంలో విశేష పూజలు నిర్వహించి 7:30 గం లకు శ్రీ సీతారామ పరివారాన్ని ఊరేగింపుగా కళాభారతి చూట్టూ , వందలాది కళాకారులు గానం చేస్తూ ఉండగా కోలాటం, నాదశ్వర వాయిద్యాలతో, కార్యదర్శి Dr. రాంబాబు త్యాగరాజ వేశాధారణలో ఉంచ వృత్తి చేస్తూ ఊరేగింపు జరుగుతుంది..
అనంతరం 8:20 నిమిషాలకు 200 మంది పైగా సంగీత విద్వాంసులు ఘనరాగ పంచరత్న కీర్తనలు ఆలపిస్తారు.
అనంతరం మంగళ ధ్వని-నాదస్వర వాద్యం: శ్రీ గురువిల్లి అప్పన్న బృందం తో కచేరిలు ప్రారంభం అవుతాయి.
ఈ 7 రోజులలో
ప్రత్యేక కార్యక్రమాలు:
19 జనవరి 2025, ఉదయం 11:00 గంటలకు: ద్వారం అకాడమీ.
20 జనవరి 2025, ఉదయం 11:00 గంటలకు: విజయవిపంచి బృందం.
22 జనవరి 2025: ఐ.వి.ఎల్ శాస్త్రి సమితి బృంద ప్రదర్శన ఉంటాయి.
ఈ ఉత్సవంపై ప్రజలు, సంగీత విద్వాంసులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులలో విపరీతమైన ఆసక్తితో ప్రతి ఏడాది సంగీత ప్రమాణాలు మరియు నాణ్యత మెరుగుపడుతూ ఉన్నాయి.
మొత్తం దరఖాస్తులు: 1169 రాగా అంగీకరించిన దరఖాస్తులు: 1110. ఉత్సవాలు 6 తోజుల బదులు ఒక రోజు పెంచి 7 రోజులు చేస్తున్నప్పటికి ఇంకా కొన్ని అప్లికేషన్ లు మిగిలి నిరాకరించ వలసి వచ్చింది.
మొత్తం సంగీత కచేరీలు: 404
10 నిమిషాల కచేరీలు: 359
15నిమిషాల కచేరీలు: 8
30 నిమిషాల కచేరీలు: 36
పూర్తిస్థాయి బృంద ప్రదర్శన: 1 (ఆరంభోత్సవం రోజు).
ఈ 7 రోజులు పాటు
సహాయక కళాకారులు:
వయోలిన్ పై 23 గురు,
మృదంగం పై 34 గురు పాల్గొంటున్నారు.
బయటి ప్రాంతాల నుండి కళాకారులు: 65 (బృందాలు మరియు వ్యక్తులు) పాల్గొంటున్నారు.
USA, AUSTRALIA, LONDON విదేశాల నుండి కళాకారులు పాల్గొంటున్నారు.
చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు.ప్రముఖ నగరాల నుండి పాల్గొంటున్నారు.
: రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, తుని, కాకినాడ, భీమవరం, ద్రాక్షారామం గోల్లప్రోలు, పెద్దజల్లుపుట్టుగ, వడ్లమూరు, గోర్రెలవాణిపాలెం తదితర అనేక ప్రాంతాలనుండి కళాకారులు పాల్గొంటున్నారు.
ముఖ్యంగా ఈ ఉత్సవాలలో గ్రేడ్ కలిగిన కళాకారులు:
A-టాప్: 7
A-గ్రేడ్: 13
B-హై: 19
B-గ్రేడ్: 12
పాల్గొంటున్నారు.
సహాయక కళాకారులు:
వయోలిన్: 3
మృదంగం: 8 మంది పాల్గొంటున్నారు.
కళాకారులు, ప్రేక్షకుల సౌకర్యార్ధం మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేసాము.
ప్రతి రోజూ ప్రసాదం వితరణ ఉంటుందని తెలియజేసేరు.
ఆర్ధిక సాయం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసేరు.
ఈ ఉత్సవాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజేయడానికి వీడియోలు, ఫోటోలను ఉపయోగించి రోజువారీ వివరాలను ప్రచురించాలని ప్రెస్ మరియు మీడియా ప్రతినిధులకు అభ్యర్థిస్తున్నాము.
ధన్యవాదాలతో,
త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్, విశాఖపట్నం
Phone: 9393109434/
9949996665