*అక్రమ అరెస్టులపై సిపిఎం నిరసన*
మోడీ బహిరంగ సభలో స్టీల్‌ప్లాంట్‌పై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని నిరసన తెలియజేసిన సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీల నాయకులను 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు తీవ్రంగా ఖండిరచారు.
అక్రమ అరెస్టులకు నిరసనగా గురువారం సాయంత్రం 6 గంటలకు మద్దిలపాలెం ఆర్టీసి బస్‌స్టాండ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కుమార్, కృష్ణారావులు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోడీ నోరుమెదకపోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మోడీకి భజన చేసారు తప్ప స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించే విధంగా వత్తిడి తేలాదన్నారు. అనకాపల్లి జిల్లా ఇంకా ఏర్పాటు కాలేని ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం సొంతగనులు కేటాయించాలని అడగడం సిగ్గుచేటన్నారు. మోడీ, బాబూ, పవన్‌లు స్టీల్‌ప్లాంట్‌పై యూ టర్న్ తీసుకున్నట్లైతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వరంగంలో కొనసాగితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోయినా ప్లాంట్ ఉత్పత్తిని పెంచుతున్నారని గుర్తుచేసారు. తక్షణమే ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.వెంకటరావు, కె.కుమారి, జి.వి.ఎన్.చలపతి, ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
వి.కృష్ణారావు
కార్యదర్శి, సిపిఎం
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ద్రోహం చేసి ప్రైవేట్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మోడీ,చంద్రబాబు,పవన్ ఖండించాలి
48