*విశాఖ సెంట్రల్ జైల్‌ను సందర్శించిన హోం మంత్రి అనిత*
*గత ప్రభుత్వం తప్పిదం వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో ఈ పరిస్థితి*.
*త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం*.
*టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరు*–హోం మంత్రి అనిత.
విశాఖపట్నం జనవరి 5:- రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్ జైల్‌ను సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్లో ఎవరు ఎవరుతో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*విశాఖ జైల్లో గంజాయి మొక్క*
జైల్లో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్లో ఉద్యోగులను బదిలీ చేస్తామని, ఇప్పటి వరకు ఎవ్వరిని సస్పెండ్ చేయలేదని అన్నారు. యూనిఫాం సర్విసులో ఉన్నవారు ధర్నాలో, బందులో పాల్గొనకూడదని, కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్‌ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగగించుకుంటామని, సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పదిరోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖ సెంట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్‌కు తరలిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైల్‌ను విజిట్ చేసిన దాఖలాలు లావని విమర్శించారు. టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరన్నారు. పది, పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిపోర్టు వస్తుందని, జైల్లో సిబ్బందిని పెంచుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.