ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అవసరం – మిద్దె తోటల మీద విద్యార్థులకు అవగాహన అవసరం

by vvwnews.com

ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అవసరం
– మిద్దె తోటల మీద విద్యార్థులకు అవగాహన అవసరం
– ప్రకృతి ఆధారిత పంటలు ఆరోగ్యకరం
– నవీన్ కుమార్, ప్రిన్సిపాల్, సెవెంత్ డె అడ్వెంటిస్ట్ స్కూల్
ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అవసరం అని సెవెంత్ డె అడ్వెంటిస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఎంవిపి కాలనీ లోని సెవెంత్ డె అడ్వెంటిస్ట్ స్కూల్ వ్యూస్ ఎన్ జి ఒ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి నేతృత్వంలో వ్యూస్ ఎన్ జి ఒ, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ సంస్థలు సంయుక్తంగా కూరగాయల మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. మిద్దె తోటల మీద విద్యార్థులకు అవగాహన అవసరం అన్నారు. ప్రకృతి ఆధారిత పంటలు ఆరోగ్యకరం అన్నారు. ప్రకృతి ఆధారిత పంటల మీద అందరికీ అవగాహన అవసరం అన్నారు. ఇళ్ళ పైకప్పు మీద, ఇంటి పరిసరాల్లో, బాల్కనీ ల్లో, విద్యా సంస్థల్లో కూరగాయల తోటలు అధికంగా పెంచాలని కోరారు.
సంస్థ అధ్యాపకురాలు జాస్లిన్ విప్పర్తి మాట్లాడుతూ ప్రకృతి ఆధారిత పంటలు పండించే విధానం మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై కప్పు మీద తోటలు పెంచాలి అని కోరారు. ఆకుకూరలు, కూరగాయ మొక్కలు పెంచుకోవచ్చు అనే విషయం ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలన్నారు. రసాయనాలు ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు వినియోగించకుండా పంటలు పండించాలి కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ వాలంటీర్ జె రవితేజ పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles