జవాన్ కుమారుడి మంచి ఆశయానికి మాజీ ఎమ్మెల్యే గణేష్ #vvwnews #ysrcp

by vvwnews.com

జవాన్ కుమారుడి మంచి ఆశయానికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ బాసటగా నిలిచారు. ఆశీలమెట్ట లో గల వైసిపి కార్యాలయంలో మంగళవారం ఉదయం వాల్తేరు కాగితాల వారి వీధి కి కొండపు శ్రీనివాస్ (ఆర్మీ) లేట్.. కొండపు అనురాధ దంపతుల కుమారుడు కొండపు అవినాష్ ఎస్ ఎస్ బి ట్రైనింగ్ కోసం రూ. 15,000 నగదును వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, దేశ రక్షణ లో టెర్రరిస్టులు చేతిలో వరుసగా ఐదు బుల్లెట్లు తగిలి అసువులు బారిన కొండపు శ్రీనివాసరావు కుమారుడు అవినాష్ తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ
(ఎన్.డి. ఏ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షల్లో అర్హత సాధించాడన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తండ్రి అడుగుజాడల్లో కొడుకు కూడా దేశ రక్షణ రంగంలో చేరుదామన్న ఆశయానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. బెంగళూరులో సర్వీస్ సెలెక్షన్ బోర్డు ( ఎస్.ఎస్.బి) శిక్షణకు అవసరమైన ఫీజును అందజేసినట్లు వెల్లడించారు. పట్టుదల కృషితో కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్న అవినాష్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles